24, డిసెంబర్ 2020, గురువారం

8. ప్రేమిస్తే...

 

ప్రియమైన  స్నేహితులారా, 

మీ అందరికి Christmas శుభాకాంక్షలు.

December నెల ప్రారంభం అయినప్పటినుండి మనందరి  హృదయాలలో చెప్పలేని సంతోషం నిండిపోతుంది కదా! అయితే ఈ ఆనందానికి కారణం ఏమిటి? 

ఎవరైనా ఇంత సంతోషంగా ఉంటే ప్రేమలో పడ్డావా అని అంటారు కదా మరి వయసుతో తేడా లేకుండా మనలో కనిపిస్తున్న ఈ ఆనందానికి కారణం ప్రేమేనా?  అంతగా ప్రేమించడానికి.. ప్రేమించబడడానికి కారణమైన వ్యక్తి ఎవరు? 
వ్యక్తి కాదు సర్వ శక్తి గల సర్వోన్నతుడు... ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వేశ్వరుడు ... ఆ  దేవాది దేవుడు మనలను ప్రేమించాడంట...
"మలాకీ 1:2 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను."

మనము ఎవరినైనా ప్రేమించిన లేక ప్రేమించబడిన,  ఆ ప్రేమకు గుర్తుగా ఏదయినా బహుమతి గాని లేక సహాయంగాని చేయాలనుకుంటాము కదా అదేవిధముగా మనలను ప్రేమించిన మన తండ్రి ఆయన ప్రేమను మన పట్ల ఎలా కనపరిచారో లేఖనాలు వివరిస్తున్నాయి.
1. సృష్టి ఆది నుండి తాను చేసిన మనిషిని ప్రేమించి మట్టినుండి పుట్టిన మానవుడు తిరిగి మట్టిగామారి నశించి పోకుండా మహిమ దేహం ధరించి తనతోనే నిత్యం ఉండాలని ఆయన సంకల్పించి ఈ భూమిమీద కూడా మనుషులు సంతోషంగా ఉండాలని మనపితరులకు వాగ్దానాలు చేసి ఆవాగ్దానం కొరకు మనము యెంతగా ఆప్రేమకు విరోధంగా జీవిస్తున్నా ఆయన మాటతప్పలేదు. 
"ద్వితీయోపదేశకాండము 4:37 ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను."

2. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక,  వీరు మానవులు మాట ఇచ్చేదేంటి... నిలబెట్టుకునేదేంటి... అని అనికోలేదు గాని తాను మనపితరులకు చేసిన ప్రమాణం కోసం తన ప్రేమ చేత మన అవిధేయతను భరిస్తూనే వచ్చారు.

"ద్వితీయోపదేశకాండము7:8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను."
"7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును."

3. దేవుడైన యెహోవాకు మనయెడల విపరీతమైన ప్రేమ కాబట్టి, ఈ లోక తలిదండ్రులు తమ బిడ్డలను చూచి మురిసిపోయినట్లుగానే ఆయన కూడా మనలను చూచి అంనందపడతారంట.

"ద్వితీయోపదేశకాండము10:15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను."

4. తండ్రికి మనమీద అపారమైన ప్రేమ కాబట్టి మనక్రియల వలన కలిగిన శాపాలను ఆశీర్వాదముగా మారుస్తున్నారు.

"ద్వితీయోపదేశకాండము23:5  అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.
33:3 ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు."

5. దేవుడు మనలను ఎంతో ప్రేమించుచున్నాడు గనుక మన పొరపాట్లను బట్టి గద్దించి బుద్ది నేర్పిస్తున్నారు.

"సామెతలు 3:12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును."
"యెషయా 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి."

6. ఆయన ప్రేమ శాశ్వతమైనది గనుక ఎన్నటెన్నటికి మన యెడల ఆయన కృప చూపిస్తూనే ఉన్నారు.

"యిర్మియా 31:3 చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను."
"1 కోరింథీయులకు 2:9 ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది."

"జెఫన్యా3:17 నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును."

7. తండ్రి తన ప్రేమను మనకు చూపించడానికి తాను చేయగలిగిందంతా చేసేసారు. చివరికి ఆయన తన ప్రియమైన
కుమారుణ్ణి కూడా మనకు కానుకగా ఇచ్చి తన ప్రేమకు అవధులు లేవని రుజువు చేసుకున్నారు. ఆ అద్భుతమైన కానుకయైన యేసుప్రభువు వారిని అనగా ఆయనకు ప్రియాతిప్రియమైన కుమారుణ్ణి మనకు ఎందుకిచ్చారు? పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఆయన కుమారుణ్ణే వారధిగా వేసి మనచేయి పట్టుకుని తన దగ్గరికి తీసుకోవాలనే గొప్పసంకల్పం ఆయన అంతులేని ప్రేమకు నిదర్శనం.
"యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను."
  • తండ్రి ఆ కానుకను యెందుకు మనకు ఇచ్చారు? మనలనుండి యేమి ఆశిస్తున్నారు?
ఆయన ఇచ్చిన కానుకను స్వీకరించి ఆ బహుమతిని ప్రేమించి ఆయన మాటకు లోబడడం మాత్రమే ఆయన మనల నుండి ఆశిస్తున్నారు. 

"యోహాను14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము."
  • ఆయన మాటలను అంగీకరించి ఆయన చిత్తప్రకారము నడవడమే ఆయన చూపిస్తున్న ప్రేమకు బదులు మనప్రేమను కనబరచడం.
"యోహాను14:24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 
15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు."
  • చివరకి తండ్రి ఇచ్చిన బహుమతి అయిన యేసయ్య కూడా మనలను ప్రేమిస్తున్నారు. అచ్చం తండ్రిలాగే....

"యోహాను15:9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
రోమా 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
8:37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము."
  • ఈ వాగ్దానాలు చూడండి  ఆనందంతో పరవశించిపోతాము.
"ఎఫెసీయులకు 1:6 మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
2:4 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.

"ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను." 

  • క్రిస్మస్ డిశంబరు 25న అవ్వచ్చు కాకపోవచ్చు. కాని ప్రభువు మనకోసం భూమి మీదకి నరావతారునిగా వచ్చి పాపంలో ఉన్న మన బ్రతుకులు మార్చి మనలను వెలిగించారు. ఇది నిశ్చయం. నా కోసం వచ్చి నన్ను వెలిగించిన నా ప్రభువు జన్మదినం నాకు పండుగ అనేది మన నినాదం.  ప్రపంచమంతా ఏక మనస్సుతో ఆ సంతోషాన్ని పంచుకోవడంలో మనంకూడా ఒక దివిటీ. అదే మనలో ఇంత సంతోషానికి కారణం.
క్రిస్మస్ శుభవార్త... యేసయ్య మాటలలో....

నేను పుట్టాను ....         మీరు పుడతారు 
నేను మరణించాను...    మీరు మరణిస్తారు 
నేను తిరిగి లేచాను...    మీరు కూడా తిరిగి లేస్తారు 
నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాను....  మీరు కూడా వస్తారు... 
రండి నా అడుగు జాడలలో.....

ఇదే సువార్త మానము రాజుల రాజు క్రీస్తు
యేసు క్ర్రీస్తు జననము  దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతి రూపము ప్రేమ మూర్తి జననము
యూదయ బెత్లెహేమందున రాజుల రాజుగ పుట్టెను
రక్షించును తనప్రజలను ఇలలో జీవము క్రీస్తు.

"ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
 2 కోరింథీయులకు 13:14"



Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com

18, డిసెంబర్ 2020, శుక్రవారం

7. పనిముట్లు (Part 2)

 ప్రియమైన స్నేహితులారా, 

ఆకాశమందున్ననక్షత్రరాశులను పేర్లు పెట్టి  పిలిచే దేవుడు,  తన నోటి మాటతో సమస్తాన్ని సృజించిన ఆ సర్వశక్తిమంతుడు,  తన   దృష్టికి  ఏమి లేనట్టుగా  ఉండే  దూళిని  తీసుకుని  మట్టిముద్దగా చేసి ప్రాణంపోసి అతనిని ప్రేమించి తనతో పాటు ఆ నిత్య  పరలోకంలో  జీవించాలని  సంకల్పించి  జాగ్రత్తగా  కాపాడుతూ,   బుద్ధినేర్పిస్తూ,   బలవంతంగా  కాక   ప్రేమతో ఇష్టపూర్వకముగా తనదగ్గరకు  రావాలని  చేసే  ప్రయత్నంలో  ఎన్నో  వస్తువులు,  జీవులు,  అనేకమంది విశ్వాసులు ఆయన చేతిలో   పనిముట్లుగా,  బలమైన  సాధనాలుగా  వాడబడిన   విధానాలను   మనం   ధ్యానం  చేసుకుంటున్నాము.  ఆ  క్రమంలో మరికొన్ని పనిముట్లను దివ్యగ్రంధం లో  వెతుకుదాం రండి.  

పనిముట్లు ( Part 1 - https://bit.ly/34tOlS7 ) లో మనము ధ్యానము చేసిన రీతిగా 1. ఎఱ్ఱ సముద్రం, 2. మోషే చేతి కర్ర.  3. గార్దభము 4. సూర్యుడు మరియు చంద్రుడు 5. గాడిద దవడ ఎముక 6. దావీదు వదిసెలలో రాయి 7. కాకులు అనునవి చాలా పాటాలను మనకు నేర్పిస్తున్నాయి కదా, అదే విధంగా ప్రభువు చేతిలో వాడబడిన మరికొన్ని పనిముట్ల గురించి ధ్యానం చేసుకుందాం. 

8. సింహాలు

 రాజైన దర్యావేషు పరిపాలన చేస్తున్న కాలములో దానియేలును ఒక ప్రధానమైన ఉద్యోగములో నియమిస్తారు.  అయితే ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్దికలిగి ప్రధానులలోను, అధిపతులలోను ప్రఖ్యాతినొంది ఉండటంవలన రాజ్యమంతటికి పైగా అధికారిగా నియమించాలని రాజు ఉద్దేశ్యం కలిగి ఉంటాడు. అక్కడ ఉన్న అధిపతులందరికి ఆ విషయం నచ్చక అతనిమీద నిందమోపడానికి ప్రయత్నం చేస్తారు. కాని ఈ దానియేలు నమ్మకస్తుడుగా ఉండి నేరమయినను తప్పయినను చేయువాడుకాడు గనుక అతనిలో లోపము వారికి దొరకలేదు.  కాబట్టి దేవుని విషయములో అతనిమీద తప్పుమోపడానికి అలోచన చేస్తారు. 

వారు ఒక చెడ్డ అలోచన రాజగు దర్యావేషుకు చెప్పి అతని అనుమతి తీసుకుంటారు. అది ఏమిటంటే 30 రోజులపాటు ఆ రాజు దగ్గర తప్ప ఏ మనుష్యుని దగ్గరగాని దేవుని దగ్గరగాని మనవి చేయకూడదు మరియు ప్రార్ధన కూడా చేయకూడదు.  ఒకవేళ అలా చేస్తే వాళ్ళు సింహపు బోనులో త్రోయబడతారు.  అయితే ఆవిషయం తెలిసినప్ప్పటికి కూడా దానియేలు యధాప్రకారముగా ప్రతిదినము 3 సార్లు మోకాళ్ళూని తన దేవునికి ప్రార్ధన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ అధికారులు దీనిని అవకాశంగా తీసుకొని రాజుకి ఇష్టము లేకపోయినప్పటికి ముందుగా తీసుకున్న రాజాజ్ఞ ప్రకారం దానియేలుని  సింహపు బోనులో వేయిస్తారు.

అయితే రాజు అనుదినము తప్పక సేవించుచున్న నీదేవుడే నిన్ను రక్షించునని  దానియేలుతో  చెప్పి  ఆరాత్రంతా  ఉపవాసము ఉండి నిద్రపట్టక  తెల్లవారుజామునే    బయలుదేరి   గుహ  దగ్గరికి   చేరి దానియేలుని   పిలిచినప్పుడు   దానియేలు   పలుకుతాడు. జీవముగల దేవుడు నిన్ను రక్షించాడా  అని రాజు    అడిగినప్పుడు దానియేలు ఏమన్నాడో తెలుసా... నా దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్లను   మూయించారు  అని అంటాడు.   అప్పుడు రాజు దానియేలు ను సింహాల బోనులో వేయించమని పురికొల్పిన అధికారులను వారి  కుటుంబాలతో  సహా  అదే  సింహపు బోనులో  వేయగానే  ఆ  శరీరాలు  నేలను  పడకముందే  వారందరిని  తినేస్తాయి. సింహములు  వారి    యెముకలను సహితము పగులగొరికి పొడిచేసాయంట.   "నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు  ఏహానియు  చేయకుండ వాటి నోళ్లు మూయించెను.  రాజా,  నీ  దృష్టికి  నేను  నేరము చేసినవాడను కాను గదా అనెను. దానియేలు 6:16".

దానియేలు యొక్క  evidence ప్రకారం యెహోవా దూత దిగివచ్చి దేవుని సేవకుడైన దానియేలు వస్తున్నాడు గనుక మీరు నోరు తెరిచి అతనిని ముట్టకూడదు అని చెప్పిఉంటాడు. దేవుడు ఇప్పుడు నోరుతెరవవద్దని చెప్పారు కదా! మరి ఆకలేస్తే ఎలా?   తగిన కాలంలో మరలా ఆయన సమృద్ధిగా ఆహరం పెట్టగల సమర్థుడని ఆ సింహాలకు తెలుసు గనుక కళ్ళముందు ఆహారం కనిపిస్తున్నా రాత్రంతా నోరుతెరవలేదు.  ఆయన ఆజ్ఞ వచ్చినప్పుడు మాత్రమే తెరిచాయి. దేవుని మాటకు లోబడడం అంటే అలా ఉండాలి. దానియేలుకున్న విశ్వాసాన్ని దేవునితో అతనికున్న సహవాసానికి  నిదర్శనంగా ఇక్కడ సింహాలు దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడ్డాయి. దానియేలు వాటి దగ్గర ఉన్నంతసేపు నోరు తెరవవద్దు అన్నారు అవి ఆయన మాటకు లోబడ్డాయి.

 9. ఎండిన ఎముకలు

దేవుడైన  యెహోవా  ఇశ్రాయేలు  జనాంగమును  వారి  పితరులకు  వాగ్దానము  చేసిన  రీతిగా  వాగ్దాన  దేశమునకు నడిపించనుద్దేశించినది మొదలు వారికి యెన్నో అద్భుతాలు  కనబరుస్తూ  వారిని కంటి పాపలా కాపాడుతూ  కనాను దేశములో యెంతో సమృద్దితో పోషించినప్పటికీ ప్రభువును విస్మరించి అన్యసహవాసమునకునూ విగ్రహములకునూ లోనై నాశనమైన ఇశ్రాయేలు జనాంగమునకు తండ్రి తన ప్రేమను కనబరచడానికి ఇక్కడ యెండిపోయిన వెముకలను పనిముట్లు గా వాడుకున్నారు.

దేవుడు యెహెజ్కేలును పిలిచి యెండిపోయిన యెముకలతో నిండిన ఒక లోయలో అతనిని దింపి ఈ యెండిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగినప్పుడు అది నీకేతెలియును ప్రభువా అని అంటాడు. అప్పుడు ఆయన యెండిపోయిన ఎముకలమీద ప్రవచించి వాటితో మాట్లాడమని చెప్పారు. అప్పుడు యెహెజ్కేలు యెండిపోయిన యెముకలారా, నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను  మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ప్రభువు చెప్పుచున్నాడని యెహెజ్కేలు అంటూ ప్రవచించు చుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుంటూ అతను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చి, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేదు. అప్పుడు దేవుడు మరలా వాటిలోకి జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము అని యెహెజ్కేలుతో చెప్పినప్పుడు, యెహెజ్కేలు,  ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము అని  ప్రవచింపగానే జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి..

అప్పుడాయన యెహెజ్కేలుతో, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను,   మన   ఆశ    విఫలమాయెను,    మనము    నాశనమై    పోతివిు   అని  అనుకొనుచున్నారు  గదా,  ఇప్పుడు  నేను  యెహోవానై   యున్నానని  మీరు తెలిసికొందురు,  మీరు   బ్రదుకునట్లు  నా   ఆత్మను  మీలో  ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు  తెలిసికొందురు అని యెహోవా వాక్కు ఇచ్చి యెహెజ్కేలు ద్వారా  వారికి  ఇంత గొప్ప సూచన చూపించారు.

ఒకటి కాదు రెండు కాదు ఒక మహాసైన్యము మరణించిన తరువాత వాటి యెముకలు యెండి పోయి ఏమాత్రం జీవించడానికి అవకాశం లేనప్పుడు కూడా వాటిని తిరిగి ఒక్క క్షణంలో జీవింప చేయగల సమర్దుడైన దేవుడు మనతో ఉన్నాడని మరొక్కమారు రుజువు చేస్తున్నారు. ఆ సూచన అప్పటి వారికొరకు మాత్రమే కాదు ఇప్పుడు మనలను కూడా విశ్వాసంలో బలపరుస్తుంది.  దాని కొరకు ఆ యెండిన యెముకలు పనిముట్లుగా వాడబడ్డాయి.
నేను  యెహోవానై  యున్నానని  మీరు  తెలిసికొందురు,  మీరు బ్రదుకునట్లు  నా ఆత్మను  మీలో  ఉంచి  మీ  దేశములో  మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు 37:1-14

10. మహా మత్స్యము

దేవుడైన యెహోవా దృష్టికి నినివె పట్టణప్రజల యొక్క పాపము చాలా ఘోరంగా కనబడినప్పుడు అయన భక్తుడైన యోనాను పిలిచి వారి పాపమునకు ప్రతిఫలము రాబోతుందని చెప్పమన్నారు.  దానికి యోనా అంగీకరించలేక తర్షీషునకు పారిపోవాలని ప్రయత్నము చేస్తాడు.  అప్పుడు యొప్పేకు పోయి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కి ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రలోకి జారిపోయాడు.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ నావికులు యెవరివలన ఈ పరిస్థితి వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తుంది.  అతనిని లేపి కారణం అడిగితే,సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను. కాని ఆయన మాటకు లోబడక యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసినప్పుడు యోనా సలహామేరకు అతనిని యెత్తి సముద్రములో పడవేస్తారు. 
అప్పుడు దేవుని చేతిలో వాడబడడానికి ఒప్పుకున్న పనిముట్టు ఏంటో మన అందరికి  తెలుసు.  జీవముగల దేవుని  గొప్పతనం  తెలిసిన  మనిషి   మాత్రం దేవుని చేతిలో వాడబడడానికి సిద్దపడక తప్పించుకుని పారిపోతున్నాడు కాని ఒక తిమింగలం మాత్రం సిద్దంగా ఉంది.  యోనా  పడీ  పడగానే  అతనిని catch చేయాలని    నియమించారు.  పడేది  ఎవరో,  ఏ క్షణంలో  పడతాడో,  అతనిని పట్టుకున్నాక ఏంచెయ్యాలో ఆ చేపకు clarity ఇచ్చారు.  
యోనా 1:17
ఏదైన ఆహార పదార్దాన్ని  మనం  నోటిలో  పెట్టుకోగానే   ఏంజరుగుతుంది? నోటిలో ఆహారమును అరిగించుకోవాడానికి జీర్ణరసాలు ఊరతాయి. అలాగే ఆపదార్దం నోటిలో యెంతసేపు ఉంటుంది? కొన్ని సెకనులు మాత్రమే కదా! అలా  గొంతు   దాటిన   తరువాత   అది   అరగకుండా  ఆపడం   మనవల్ల అవుతుందా?  మానవులమైన మనవల్ల సాధ్యంకాని పని ఆ తిమింగలం వల్ల సాధ్యమయ్యింది. వొక నిమిషం కాదు,  వొక గంట  కాదు  పూర్తిగా  మూడు దినాలు.  ఎందుకంటే ఆ తిమింగలం దేవుని  చేతిలో  వాడబడుతున్న  పనిముట్టు.   ఆ పనిముట్టు యెంతగొప్పగా వాడబడిందో ఆలోచిస్తే చాలా అశ్చర్యం కలుగుతుంది కదా! 

1. ఆ మూడు దినాలు యోనాతో పాటు ఆ మత్స్యం కూడా ఉపవాసంతో ఉంది.
2. పోని వేరే చేపలను తింటే లోపలున్న యోనా కూడా అరిగిపోతాడు కాబట్టి తినలేదు.
3. ఆహారం కడుపులో పడింది కాబట్టి జీర్ణరసాలు ఊరతాయి.  అలా ఊరకుండా జాగ్రత్త పడాలి. 
4. అలాగే దేవుడిచ్చిన map ప్రకారం తిన్నగా నినివే చేరి ఆయన యెప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు యోనాగారిని కక్కి వేయాలి.
ఖచ్చితముగా ఆ పనిముట్టు ప్రభువు చిత్తమును నెరవేర్చినట్టు ప్రత్యక్ష సాక్షి అయిన యోనా భక్తుడే వివరించాడు. 

11. చేప (అర షెకెలు దొరికిన చేప)

జెరూసలెంలో ఆలయ నిర్వహణకు నిధులు సమకూర్చడానికి రోమన్ సామ్రాజ్యం అంతటా యూదులందరూ యూదుల ఆలయ పన్ను చెల్లించవలసి ఉంది.  యేసు ప్రభువు వారు మరియు ఆయన శిష్యులు పెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడిగితే చెల్లిస్తారు అని చెబుతాడు. 

అప్పుడు ప్రభువు పేతురుని పిలిచి సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెబుతారు. దీని గురించి ఒక్క క్షణం ఆలోచించండి, వాస్తవానికి ఇది జరిగే అవకాశాలు ఏమిటి? పీటర్ ఒక మత్స్యకారుడు కాబట్టి, మొదటగా వచ్చిన చేపను పట్టుకోవడం అలాగే దాని నోటిలోనే నాణెం దొరకడం అనేది  యాదృచ్ఛికంగా జరిగే అవకాశం లేదు అని అతనికి స్పష్టంగా తెలుసు.

దేవుడు చేసిన కార్యాలన్నీ అద్భుతంగానే ఉంటాయి. యోనా 1:17 ప్రకారం దేవుడు యోనాని మింగడానికి ఒక గొప్ప చేపను పంపించినట్టుగానే ఇక్కడ యేసు చేపలను అందించడమే కాదు, చేపలను పీటర్ యొక్క హుక్ పైకి నేరుగా సరైన సమయంలో నడిపించాడు, యేసు చెప్పినట్లుగా పేతురు చేసినప్పుడు మరియు నోరు తెరిచినప్పుడు, అతను ఒక వెండి షెకెలుకు సమానమైనదాన్ని కనుగొన్నాడు, ఇది వారిద్దరికీ ఆలయ పన్ను చెల్లించడానికి అవసరమైన ఖచ్చితమైన మొత్తం .
ఒక చిన్న చేప యెక్కడనుండి వచ్చిందో తెలియదు. దానికి ఒక identity కూడా లేదు.  కాని దేవుని చేతిలో వాడబడడానికి సిద్దమైపోయింది. 
ఆ చేప నోటిలోనికి ఆ నాణెం యెలా వచ్చిందో మనకు తెలియదు గాని ప్రభువు తనకు ఒకపని అప్పగించారు. ఏమిటంటే పేతురు వచ్చి గేలము వేసినప్పుడు మొదటగా నువ్వే వెళ్ళి ఆ హుక్ కి తగలాలి.  పేతురు చేప నోటిలోనుండి ఆనాణెం తీసుకునేంత వరకు అది ప్రభువు మాట కొరకు కనిపెడుతూ ఉంది. దానిని మింగకోడదు అలాగే వేరే దేనిని తినే అవకాశం లేదు. ప్రభువు చెప్పిన పనిని జాగ్రత్తగా నెరవేర్చిన ఒక చిన్న పనిముట్టు.   చాలా చిన్న విషయంలాగే అనిపిస్తుంది కాని అక్కడ జరిగిన కార్యం నిజంగా ఒక అద్భుతం. మత్తయి 17:24-27

12. నీరు (నీరు ద్రాక్షారసముగా)
యోహాను 2:8-9
యోహాను సువార్తలో యేసు చేసిన మొదటి అద్భుతం నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం. 2: 1-12 ప్రకారం, ఒక వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఇది వరుడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యేసు నిశ్శబ్దంగా జోక్యం చేసుకున్నారు. అంచులవరకు  కుండీలను నింపాలని ఆయన సేవకులను ఆదేశించారు. తరువాత యేసయ్య చెప్పిన ప్రకారం సేవకులు నీటితో మారిన ద్రాక్షారసం‌ను విందు యజమాని వద్దకు తీసుకువచ్చినప్పుడు, అతను రుచి చూసి ఆశ్చర్యపోయాడు.
కేవలం తననోటి మాటతో ప్రపంచములను మరియు ఈ సృష్టిని నిర్మించిన యేసు ప్రభువువారు మానవ రూపంలో భూమిమీదికి వచ్చినప్పుడు  తనను నమ్మినవారి కోసం ఒక అద్భుతం చేసే అవసరం వచ్చింది. కాని ఇప్పుడు నోటి మాట కూడా వాడినట్టు ఆ సందర్బంలో లేదు. పనివారిని ఆయన నీళ్ళతో నింపండి అనగానే ఆ ఆజ్ఞ నీటికి చేరింది. ప్రభువు మాట యొక్క అద్భుత శక్తికి ఆ నీటియొక్క రంగు, రుచి, వాసన కూడా మారిపోయాయి. యెప్పుడూ ఇంత గొప్ప ద్రాక్షరసాన్ని వారు త్రాగలేనంత అధ్బుతంగా అదిమారిపోయింది.  నేటికి కూడా ఈ సంధర్బాన్ని గురించి ధ్యానించినప్పుడు అది ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా మనకు ఒక మాదిరికరమైన సందేశాన్ని కూడా ఇవ్వడానికి ఆ నీరు ప్రభువు చేతిలో పనిముట్టు గా మారింది.

13. గాలియు సముద్రమును
 ఒక రోజు యేసుప్రభువు వారు తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి వెళ్దామని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరుతారు. వారు వెళ్లు చుండగా ఆయన ఓడ అమరమున నిద్రిస్తూ ఉంటారు. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండి పోవడం వలన వారు అపాయకరమైన స్థితిలో ఉంటారు. అప్పుడు ఆ శిష్యులు భయపడి ఆయనను లేపి ప్రభువా ప్రభువా,  మేము చచ్చిపోయేలా ఉన్నాము నీకు చింత లేదా అని అడుగుతారు. అప్పుడు ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమవుతుంది. 
ఆ ఓడలో ఉన్నది యెవరు? స్వయాన ఆ నీటిని గాలిని సృష్టించిన యేసయ్య.  మరి వాటికి తెలియదా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదని? తెలుసు! కాని ఆయన శిష్యులలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయనే వాటిని నియమించారు. ఇప్పుడు అవి ఆయన చేతిలో పనిముట్లుగా వాడబడుతున్నాయని వాటికి అర్ధమయ్యింది. కాని గాలిని నీటిని control చేయగల సమర్దుడు వారితో ఉన్నాడని శిష్యులకి అర్దం కాలేదు. ఒకవేళ అర్దమైన పరిస్తితులను చూచి, తెలియనట్టుగా బయపడిపోయారు. 
"అప్పుడాయన లేచి మీ విశ్వాసమెక్కడ అని వారితో అన్నారు. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడతారు. లూకా 8:22-25."


ఇంకా ధ్యానిస్తూ ఉంటే ప్రభువు   కోసం   పనిచేసి   ఆయన   చిత్తమును   నెరవేర్చిన  పనిముట్లు  లేఖనాలలో యెన్నో ఉన్నాయి. అలాగే తండ్రి మాటకు లోబడి ఆయన చిత్తమును నెరవేర్చిన న్యాయాధిపతులున్నారు. ప్రవక్తలు, రాజులు ఉన్నారు. దైవ సేవకులు, మిషినరీస్ వీరందరూ ప్రభువు చేతిలో వాడబడుతున్న పనిముట్లే. 
  • విలియం కేరి ఈ పరిశుద్ద గ్రంధం మన చేతులలోనికి రావడానికి ఒక పాత్రగా వాడబడ్డాడు.
  • మార్టిన్ లూధర్ సంఘ సంస్కరణ చేసే పనిముట్టుగా వాడ బడ్డాడు.     
                              ఇంకా యెందరో ఉన్నారు.......

ఇప్పుడు మన ఒంతు.

  • మన కుటుంబంలో తల్లిగా, చెల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా ఏ స్తితిలో మనం ఉన్నామో ఆ భాధ్యత ప్రభువు ఇచ్చిన పనిగా భావించి ఆ role ని లోపంలేకుండా  నిర్వర్తించడమే ఆయన చేతిలో పనిముట్టుగా వాడబడడం. 
  • అంతేకాదు ప్రభువు ప్రేమని ప్రకటించవలసిన భాధ్యత కూడా మనమీద మోపబడి ఉంది.  మనం వెలిగించబడిన మీదట అనేక మందికి వెలుగుగా ఉండాలి కదా! మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు అన్నమాటకు మనమే కదా రుజువులం.
మనల్ని మనం ఆయనకు అప్పగించుకొంటే ఆయన ఏవిధముగానైనా వాడుకుంటారు. మన జీవితమే ఒక సువార్తగా మారిపోతుంది.  
2 తిమోతికి 2:21 ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
  •  నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. యోహాను 13:15."
  • "నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యోహాను 13:20"
  • "రోమా 9:23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,"
 సిద్దముగా ఉంటే మనము కూడా అయన చేతిలో పనిముట్టుగా వాడబడతాము..
అది యేపని అయినా...ఆయన కోసం....
నేను ముగిస్తున్నాను... సిద్దపడదాం....వాడబడదాం... 


ప్రార్దన చేద్దాం

 ప్రభువా! నేను సిద్దమే! నన్ను వాడుకో! 
ఆమెన్!!

ప్రభువా నే సిద్ధముగా ఉన్నాను నన్ను వాడుకో 
ఈ దీన పాత్రను వాడుకో 
నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నింపి...... వాడుకో 

Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com



15, నవంబర్ 2020, ఆదివారం

6. పనిముట్లు ( Part 1)

ప్రియమైన స్నేహితులారా, 

మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. 

ఈ Topical studies ద్వారా మీ వాక్య అధ్యనానికి నేను కొంతవరకు సహాయపడగలుగుతున్నానని నమ్ముతూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభువు కృప మీకు తోడై ఉండును గాక.
లేఖనాలలోని కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ  ఉంటాయి. అదే సమయంలో మనకు పాఠము కూడా  నేర్పిస్తుంటాయి.  దేవుడు మనుషులమైన మనలను ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన చేసిన ప్రణాళికలను గురించి గత topics లో  తెలుసుకున్నాము.  అందులో ఈ సృష్టిని కూడా మనకోసమే చేసి దానిని ఏలమని చెప్పారు.  దేవుడు మనిషిని సృష్టించి వానిని తన రాజ్యములో చేర్చుకోవాలని తలంచినప్పుడు, బుద్ది పూర్వకముగా పాపము చేసిన మనిషిని తిరిగి బుద్ది పూర్వకంగానే   తన రూపులోనికి మార్చుకోవడానికి ఆ సర్వశక్తిమంతుడు ఈ సృష్టినే తన పనిముట్లుగా వాడుకున్నారు. ఆయన రూపులోనికి మారిన మనుషులను కూడా తన పనిముట్లుగా వాడుకుంటారు. 
ఆయన చేతులలో వాడబడాలంటే ఆ పనిముట్టు జీవము గలదియే కానక్కరలేదు. మహాఘనత కలిగినదే అవ్వనక్కరలేదు.  ఆయన వాడుకోవాలి అని అనుకుంటే దేనినైనా ఎవరినైనా వాడుకోగలరు,  అదేవిధంగా అయన చేతిలో వాడబడితే  ఎలాఉంటుందో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం.

ఈ topic లో ప్రత్యేకించి ప్రకృతిని ప్రభువు పనిముట్లుగా ఎలావాడుకున్నారో, అవి ఆయన మాటకు ఏవిధంగా లోబడ్డాయో లేఖనాల నుండి మరియు నాకు లభించినంతవరకు చారిత్రక ఆధారాలతో మీముందు ఉంచడానికి ప్రయత్నము చేస్తాను. 
మొదటగా ఎఱ్ఱ సముద్రంతో ప్రారంభిద్దాము. 
1. ఎఱ్ఱ సముద్రం
  • ఎర్ర సముద్రం  పొడవు సుమారు 2250 కిమీ (1398 మైళ్ళు), 
  • వెడల్పు 355 కిమీ, 
  • లోతు (గరిష్ట) 8,200 అడుగులు (2,500 మీ) మరియు సగటు లోతు 1,640 అడుగులు (500 మీ).   
మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా సముద్రము రెండు పాయలుగా చీలి ఆరిననేల మీద ఇశ్రాయేలు జనాంగము నడిచివెళ్ళారని మనకు తెలుసు. (నిర్గమ కాండము 14:16-22) అయితే ఈ సంఘటనని (అద్భుతాన్ని) కాస్త లోతుగా ఆలోచిస్తే ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తున్నాయి. 
అంతేకాకుండా ఆ గొప్ప కార్యము జరగడానికి  ఎన్ని పనిముట్లు వాడబడ్డాయో జాగ్రత్తగా ఆలోచిస్తే దేవున్ని స్తుతించకుండా ఉండలేము.
దేవుడు చెప్పినట్లుగా "మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నిర్గమ కాండము 14:22" అని వాక్యం చెబుతుంది.
  • అంటే మోషే చెయ్యి చాపడానికి ముందే దేవుడు "గాలి" ని పిలిచి దానికొక వేగాన్ని నిర్ణయించి ఎర్ర సముద్రము విభాగింపబడి అక్కడ కనిపిస్తున్న ప్రదేశము పొడి నేలగా అయిపోవాలి కాని నీ వేగము అక్కడే ఉన్న నా జనాంగానికి  ఏమాత్రం ఇబ్బంది కలిగించ  కోడదు అని చెప్పిఉంటారు.  
  •  తరువాత దేవుడు 8,200 అడుగులు (2500 మీటర్ల) లోతులో ఉన్న సముద్రము గడ్డకట్టి ఆరిన నేలగా మారిపోవాలి అని అంటే అది భూమికి సమాంతరముగా ఆరిన నేల కనబడాలి అనగా  దేవుని ప్రజలు మైదానము మీద నడిచినట్లుగా ఒడ్డు నుండి చీలిన సముద్ర మార్గముగుండా వెళ్ళాలి. "నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను." నిర్గమకాండము 14:22      "నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను" నిర్గమకాండము 15:8. అది ఖచ్చితముగా జరిగిన నట్టు వాక్యం నిర్దారిస్తుంది. 
  • సముద్ర్రాన్ని పిలిచి గాలి నిన్ను కలవరపెట్టినప్పుడు రెండుగా చీలిపోవాలి. అటు ఇటు రెండు గోడల వలె రాసిలా నిలబడాలి అన్నారు. అంటే ice గడ్డలా అయిందనమాట. అలాంటప్పుడు ప్రజలు చలిలో నడవలేరుకదా అందుకని వెచ్చదనం పుట్టించే "అగ్నిస్తంభం" వారితోనే ఉంది.
  • మరలా దేవుడు సముద్రపు నీరు యధాస్థితికి రమ్మనిచెప్పిన ఖచ్చితమైన సమయానికి అది వెనక్కు రావాలి.
అంతలో యెహోవా మోషేతో-ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నిర్గమ కాండము 14:26,27. 
చారిత్రక ఆధారాలు:
Chariot Wheels in the Red Sea
(first published in newsletter # 3 in 1993)

పురావస్తు శాస్త్రఘ్నుడైన Ron మరియు అతని team వారు 1978వ సంవత్సరంలో Gulf of Aqaba లో dive కి వెళ్లినప్పుడు పగడపు మొక్కలతో(Coral) కప్పబడిన రధాల యొక్క అవశేషాలను కనుగొన్నారు.  పగడపు మొక్కలతో (Corals) కప్పబడి ఉండడం వలన యెంతో కష్టతరం అయినప్పటికి వారు అనేక చక్రాలను కనుగొన్నారట. అందులో కొన్ని ఇప్పటికీ వాటి ఇరుసులపై మరికొన్నిభూమిలో దిగబడి ఇంకా చక్రాలు లేని రధాల క్యాబ్లు ఉన్నాయట. అందులో అనేకమైన 6-spoked wheels మరియు 8-spoked wheels ఉన్నాయని ఆ పరిశోధకులు చెబుతున్నారు.
తరువాత 1988 లో, రాన్ దాదాపుగా స్పష్టంగా కనిపిస్తున్న 4-స్పోక్డ్ బంగారు రథ చక్రంను కనుగొన్నాడు, పగడపు మొక్క బంగారంపై పెరగక పోవడమే ఇది బాగా సంరక్షించబడటానికి కారణం అయ్యింది అని వివరించాడు. మొత్తం ఆ చక్రాలన్నిటిని రాన్ Cairo లోని  అతను పనిచేస్తున్న పురాతన వస్తువుల డైరెక్టర్ నాసిఫ్ మొహమ్మద్ హసన్ కార్యాలయానికి తీసుకువెళ్ళాడట. మిస్టర్ హసన్ పరిశీలించి, వెంటనే దీనిని పురాతన ఈజిప్ట్ యొక్క 18 వ రాజవంశంది అని ప్రకటించారు. రాన్ అతనిని ఇంత సులభంగా ఎలా తెలుసు అని అడిగినప్పుడు, మిస్టర్ హసన్ 8-స్పోక్డ్ వీల్ 18 వ రాజవంశంలో మాత్రమే ఉపయోగించబడిందని వివరించాడు.
ఈ ఆధారాలన్నిటిని బట్టి ఎర్రసముద్రం పాయలుగా చీల్చబడిన సంఘటన ఖచ్చితముగా జరిగినదని వాక్యం తెలియక పోయినప్పటికి నమ్మసఖ్యముగా ఉండవచ్చు.  కాని మనకైతే మన సర్వశక్తుడైన దేవుడు వీటన్నిటిని చేయగల శక్తిమంతుడని మనకు తెలుసు. లేనివాటిని ఉన్నట్టుగా పిలువగల సమర్ధుడని మనకి తెలుసు.  
దేవుడు 6 లక్షలకు పైగా ఉన్న  తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఆరిన నేల మీద నడిచి వెళ్లాలంటే,  తన ధర్మానికి విరుద్ధంగా లేచి నిలువబడి ఆయన చిత్తం అంతటిని నెరవేర్చిన గొప్ప పనిముట్టుగా  ఈ ఎఱ్ఱసముద్రం వాడబడింది అని మనకి స్పష్టముగా అర్దమవుతుంది కదా! 

2. మోషే చేతి కర్ర.  
ఇశ్రాయేలు జనాంగమునకు నాయకత్వము వహించడానికి దేవుడు మోషేను పిలిచి అతని చేతి కర్రను వాడుకొని అతనిలో విశ్వాసపు పునాదులు వేసారు. 

 యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను. అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
అప్పుడు యెహోవా-నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.  నిర్గమ కాండము 4:2-4
1. ఆ తరువాత నుండి అది దేవుని కర్రగా పిలువబడింది. ఆయన చేస్తున్న ప్రతిఅద్భుతానికి ఆ కర్రను ఒక పనిముట్టు గా వాడుకొని ఏమాత్రం శక్తి బలములు లేని ఒక చేతి కర్ర పైకెత్తినప్పుడు,  అలాగే  దేనినైన ముట్టినప్పుడు అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించారు.  "మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను. నిర్గమ కాండము 4:20".
2. ఇశ్రాయేలియులకు అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు మోషే దేవుని కర్రను కొండ మీద నుండి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. "రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను. నిర్గమ కాండము 17:9".
3. దేవుడు చెప్పినట్టు మోషే తన చేతి కర్రతో ధూళిని కొట్టినప్పుడు ఆ ధూళిఅంతా పేలుగా మారిపోయాయి.  "అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. నిర్గమ కాండము 8:16"
4. మరలా ప్రభువు ఆజ్ఞతో ఐగుప్తు దేశము మీద కర్రను చాపగా దేవుడు ఆదేశము మీదకు మిడతలను రప్పించారు. "మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. నిర్గమ కాండము 10:13".
5. దేవుడు మరలా మోషేను పిలిచి హోరేబులోని బండను కొట్టమనగా, అతను ఆవిధంగా చేయగానే ఆ బండలోనుండి నీరు ఉబికి వచ్చినట్టు మనకు తెలుసు. "అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము.  ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.నిర్గమ కాండము 17:5".
ఇక్కడ జరిగిన కార్యములన్నీ చేసింది ప్రభువే అయినప్పటికీ ఆయన మోషే చేతిలో ఒక చిన్నకర్రను తన పనిముట్టుగా వాడుకున్న విధానం నిజంగా ఆశ్చర్యమే.

3. గార్దభము 
దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును శపించాలని మోయాబు రాజైన బాలాకు, ప్రవక్త అయిన  బిలాము ను పిలిపించగా అతఁడు దానికి సిద్దపడి వెళ్తున్నప్పుడు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చి అతనికి బుద్ధిచెప్పారు.
అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అదినీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా సంఖ్యాకాండము 22:28,31

2 పేతురు  2:16. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.

ఈ ప్రవక్త కు బుద్ది చెప్పడానికి గాడిదను దేవుడు ఒక పనిముట్టుగా వాడుకొని అతనితో మాట్లాడారు.

4. సూర్యుడు మరియు చంద్రుడు 
దేవుడు మనకొరకు సూర్యుడిని చంద్రుడిని చేసి పగటిని మరియు రాత్రిని ఏలమని అప్పగించినప్పటి నుండి ఇంతవరకు దేవుని చేతిలో పనిముట్లుగా అవి వాడబడుతూనే ఉన్నాయి. ఆయన ఉద్దేశమును నెరవేరుస్తూనే ఉన్నాయి.  - ఆదికాండము 1:14,15
యెహోషువ అమోరీయులతో యుద్ధమునకు దిగినప్పుడు వారు ఓడించవలసిన శత్రువులు ఇంకా మిగిలిఉన్నప్పుడు యెహోషువ దేవునికి ప్రార్ధన చేసి సూర్యచంద్రులతో మాట్లాడి మీరు ముందుకి వెళ్లొద్దు అని చెప్పినప్పుడు,  దేవుడు అతని ప్రార్ధన అంగీకరించి వాటిని కదలవద్దని ఆజ్ఞాపిస్తే అవి ఒక రోజంతా అలాగే కదలకుండా ఉండిపోయాయంట. దీనికి సంబంధించిన పూర్తి వివరణ "4. సూర్యుడు(నీతి సూర్యుడు)" అనే article లో చారిత్రక ఆధారాలతో సహా వివరించబడ్డాయి.

 యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.  సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోషువ 10:12, 13

5. గాడిద దవడ ఎముక 
దేవుడు సమ్సోను ను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నియమించిన దినములలో అతనిని ఫిలిష్తీయులు చంప నుద్దేసించినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగి రాగా అతడు గాడిద పచ్చిదవడ యెముక తీసుకొని వెయ్యి మందిని చంపి యెహోవా నాకు విజయము కలుగజేసెను అని కొనియాడాడు.
  అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టి నీవు నీ సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత... న్యాయాధిపతులు 15:15-18

దేవుడు సమ్సోనును కాపాడి తన ప్రజలకు రక్షణ కలుగజేయడానికి ఇక్కడ గాడిద దవడ యెముకను పనిముట్టుగా వాడుకున్నారు.

6. దావీదు వదిసెలలో రాయి
ఫిలిష్తీయులు ఇశ్రాయీలీయులతో  ఏలా లోయలో 
యుద్దమునకు దిగినప్పుడు వారిలోనుండి గొల్యాతు అనబడే ఒక శూరుడు పైకివచ్చి, జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించి దూషిస్తూ ఉండగా దానిని గమనించిన దావీదు సౌలు యొక్క అనుమతితో ఆ ఫిలిష్తీయుని సమీపించి, సైన్యములకు అధిపతియైన యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను, ఆయన కత్తిచేతను ఈటెచేతని రక్షించువాడు కాడు.. యుద్ధం  యెహోవాదే అని చెప్పి తనకర్ర చేతపట్టుకొని ఏటిలోయలోనుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని అందులో ఒకటి తీసుకొని వడిసెలతో విసరి ఆఫిలిష్తీయుని నుదుటి మీద కొట్టగా ఆ రాయి అతని నుదురులోనికి దూరి అతడు నేలను బొర్లపడి చనిపోయెను.
 ఒక చిన్న రాతితో ఒక బలవంతుని చంపడం సాధ్యమేనా? ఆ రాయి దేవుని చేత ఆజ్ఞపొందితే, ఆయన చేతిలో పనిముట్టుగా మారితే.. అది ఖచ్చితముగా సాధ్యమే.

సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. 1 సమూయేలు 17:37
తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. 1 సమూయేలు 17:49

7. కాకులు
 యెహోవా కొరకు మహారోషముకలిగి యెహోవా ప్రవక్తగా పిలువబడిన ఏలియాను ప్రభువు పిలిచి తాను ఉన్న
 చోటునుండి బయలుదేరి యొర్దాను యెదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసముచేయమని చెప్పారు. మరి అతనికి ఆహారము? దానికి ఆయన దగ్గర ఒక plan ఉంది.  
తన సేవకుడైన ఏలియాకు ఆహారం పెట్టడానికి దేవుని చేతిలో వాడబడిన పనిముట్లు ఏమిటో తెలుసా?  ఏలియాకు రెండు పూటలా  సమృధ్దిగ రొట్టెను, మాంసమును తెచ్చి ఇవ్వడానికి తిండిలేక తిరుగులాడుచు ఉండే కాకోలములకు (కాకులు) దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. 1 రాజులు 17:6
ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా 1 రాజులు 17:4
వాటికే తిండిలేక ఎక్కడ ఆహారము దొరుకుతుందా అని కావ్ కావ్ మని అరుచుకుంటూ తిరిగే కాకులకు రెండుపూటలా ఏలియా కోసం రొట్టె  మాంసము యెక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా ఏలియాకు తెచ్చి ఇస్తాయా? 
ఖచ్చితముగా ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు  ఆ కాకులు ఏలియాకి భోజనం పెట్టడానికి దేవుని చేతిలో వాడబడిన పనిముట్లు. 
ఆహారమును చూడగానే వాటికి తినాలనిపించినా అవి తినవు. ప్రభువు చిత్తమును నెరవేర్చిన తరువాత ఆయనే వాటికి తగిన ఆహారం పెడతారని వాటికి తెలుసు.
తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు 38:41
 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. కీర్తన 147:9
కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిన పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. లూకా 12:24
ఈ సందర్బాలన్నీ మనకు చిన్నప్పటినుండీ తెలిసినవే అయినప్పటికి వాటిని మరలా మరలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు 
జీవం లేని కర్ర, విశ్వాశం అంటే తెలియని జీవులనే దేవుడు మనకు సహాయం చేయడానికి ఇంకా ఆయన చిత్తమును గ్రహించడాని పనిముట్లుగా వాడితే మనల్ని ఇంక ఎక్కువగా వాడుకోవచ్చుకదా. 
ఆయన చేతి పనులను గురించి ధ్యానం చేసినప్పుడు  మనము ఆయన ప్రేమను గ్రహించి ఆయనయందు విశ్వాశంలో బలపడతాము అదే  ఆయన ఉద్దేశం. 

దేవుని మాటకు లోబడి ఆయన పనిముట్లు గా వాడబడిన మరికొన్ని పనిముట్లను  తరువాతి article లో ధ్యానించుకుందాం. 

ఇంతవరకు ఇవ్వబడిన పనిముట్లకు సంభందించిన వచనాలను క్రింద ఇస్తున్నాను గమనించండి.

1. ఆది కాండము:   3:14; 9:10; 1:14,15
2. నిర్గమకాండము:   4:2-3,20; 17:9; 14:16-22; 15:5,8,19,25; 10:12
3. సంఖ్యాకాండము:   22:23,28,31
4. ద్వితియోపదేశకాండము:  29:5
5. న్యాయాదిపతులు:  15:15
6. 1 సమూయేలు :  17:37,49
7. 1 రాజులు:  17:6
8. 2 రాజులు :  10:9
9. కీర్తన 106:9

Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com

7, అక్టోబర్ 2020, బుధవారం

5. దేవుడు చేసిన మనిషి Vs మనిషి చేసిన దేవుడు

 దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

ప్రియమైన స్నేహితులారా,  

మన తండ్రియైన దేవుడు చేసిన సృష్టిని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఒక్క మాటతో చేసిన ఈ సృష్టినిగురించి ఆలోచిస్తూ ఉంటే నాకు కొన్ని ప్రశ్నలు కలుగుతున్నాయి. 
  • ఇంతగొప్ప ఆకాశమును, సూర్యుడిని ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తున్న ప్రతి సృష్ట్యాన్ని ఆయన కేవలం తన నోటి మాటతో చేసి, ఇంతలో కనబడి అంతలో ఆవిరై పోయే  మనుషులమైన మనలను  ప్రత్యేకించి తన స్వహస్తాలతో ఎందుకు చేసారు? 
  • సమస్త సృష్టి ఆయన మాటకు లోబడి వణుకుతూ ఉంటే, ఏమాత్రం ఆయనంటే భయం లేకుండా జీవిస్తున్న  మెడలు వంచని ఈ జనాంగము కొరకు తన ప్రియమైన కుమారుణ్ణి శ్రమలు పొంది ప్రాణం అర్పించడానికి ఎందుకు పంపించారు?  
  • సృష్టి కర్త ఆయనే అని ఎన్నో ఆధారాలు కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా చెట్టు పుట్ట పట్టుకుని అదే దేవుడు ఇదే దేవుడు అంటూ జీవిస్తున్న మనుషుల కోసం ఎందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు? 

ఇన్ని doubts వచ్చాక ఇంకెందుకు ఆలస్యం.. లేఖనాలను పరిశీలించి సత్యాలను తెలుసుకుందాం రండి.  

దేవుడు మనిషిని చేశారు!

దేవుడు మనిషిని ఎలా చేశారు? 

దేవుడు తన స్వరూపమందు అనగా తన పోలికలోనే మనిషిని సృష్టించాలని నిశ్చయించుకున్న తరువాత, నేలమట్టిని తీసుకుని నరుని నిర్మించి అతని నాసికారంధ్రాలలో జీవవాయువు ను ఊదగా నరుడు జీవాత్మగా మారాడు అని ఆదికాండము 2:7 చెబుతుంది.    

యోబు కూడా 33:4 వ వచనంలో "దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవ మిచ్చెను" అని స్పష్టం చేస్తున్నాడు.

అయితే దేవుడు నోటితో నరుని నాసికారంధ్రాలలో తన ఊపిరిని  ఊదితే  నడయాడే మనిషిగా ఆ మట్టి బొమ్మ మారిపోయింది అని అంటే ఆ ఊపిరి  అంత సామాన్యమైనదంటారా? కాకపోతే మరి ఎలాంటిది? అయితే ఊపిరి బిగబట్టి వినాల్సిందే!

1. ఆకాశమహాకాశముల పైనుండి  ఆయన కోపంతో తన శ్వాసను గట్టిగా వదిలితే భూమిలో ఉన్ననీటి అడుగు భాగం కనిపిస్తుందట. "యెహోవా తన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. 2 సమూయేలు 22:15. "

2. అంతేకాదు ఆయన ఊదితే చాలు మనుషులు పిట్టల్లా రాలిపోతారు. "దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు. యోబు 4:9", "దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు. యోబు 15:30"

3. ఆయన ఊపిరి ఊదితే భూమి మీద మంచుకూడా పుడుతుందట. "దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల  పైభాగమంతయు గట్టిపడును. Job 37:10"

4. వీటన్నిటికంటే కూడా గొప్ప సంగతేమిటంటే ఇప్పుడు మనకంటికి కనిపిస్తున్నవి ఇంకా కనపడని ఈ ఆకాశ సమూహములన్నీ కూడా ఆయన నోటి ఊపిరితోనే కలిగాయని కీర్తనాకారుడు అంటున్నాడు. "యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. కీర్తన 33:6"

అయితే మరి మనిషి మట్టి నుండి పుట్టాడు అనడానికి ఋజువేంటి?

  • కొత్త శాస్త్రీయ పరిశోధనల ప్రకారం భూమిపై ఉన్న ప్రాణులన్నీ బైబిల్లో తెలియజేయబడినట్లు  మట్టి నుండి వచ్చి ఉండవచ్చు అని నమ్మక తప్పడం లేదు. మట్టి  ప్రాథమికంగా భూమిలోని ఖనిజాలు, చిన్న  చిన్న అణువులు మరియు రసాయనాల పెంపకమునకుఅనుకూలంగా ఉంటూ రసాయనాలు ఒకదానికొకటి స్పందించి ప్రోటీన్లు, డిఎన్‌ఎ మరియు చివరికి జీవకణాలను ఏర్పరుస్తాయి అని శాస్త్రవేత్తలు సైంటిఫిక్ రిపోర్ట్స్ లో  చెప్పారు.  
  • న్యూయార్క్ రాష్ట్రంలోని నానోస్కేల్ Science కోసం కార్నెల్ విశ్వవిద్యాలయం యొక్క బయోలాజికల్ ఇంజనీర్లు మట్టి 'భూమిపై జీవన జన్మస్థలం (అనగా మట్టి నుండి మనిషి తయారు చేయబడ్డాడు) అయి ఉండవచ్చు' అని నమ్ముతారు.
మనిషి నేల  మట్టినుండి తయారు చేబడ్డాడు అని వాక్యము ద్వారా నిర్ధారణ అయ్యింది కదా! అయితే నేల మట్టిలో ఉన్నవి మనిషిలో కూడా ఉండాలి కదా! ఆ సంగతి కూడా పరిశీలన చేద్దాం. 
నేలలో ఉండే పోషకాలు మానవశరీర పోషకాలతో సమానముగా ఉన్నాయి అని ఋజువు చేసే కొన్ని పరిశోధనలనుండి సేకరించిన విషయాలు.

1. మొక్కలకు పోషకాలు ప్రధానంగా నేల నుండి వస్తాయి.
2. మానవులకు పోషకాలు ప్రధానంగా ఎక్కువ శాతం నేలలో పెరిగిన ఆహారం నుండి వస్తాయి. 
3.పొటాషియం మానవ కండరాల నియంత్రణ  మరియు గుండె యొక్క స్పందనకు సహాయపడుతుంది. మొక్కలలో పొటాషియం నీటిని సమర్థవంతంగా నియంత్రిస్తూ మొక్క అంతా సరఫరా చేయడానికి సహాయపడుతుంది.
4. మొక్కల అవసరాల నేపథ్యంలో, కార్బన్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్‌ను ఖనిజేతర పోషకాలు అంటారు. ప్రజలకు ఇవి కూడా అవసరం.
5. మానవులకు మరియు మొక్కలకు అవసరమైన పోషకాల యొక్క పూర్తి జాబితాలో మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము, రాగి, కార్బన్, నత్రజని, ఆక్సిజన్, హైడ్రోజన్, భాస్వరం, సల్ఫర్ మరియు క్లోరిన్ ఉన్నాయి.
6.మానవ  శరీరంలో ఇనుము, ఆక్సిజన్‌ను సరఫరాచేయడానికి హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. ఇది మొక్క చుట్టూ  కదిలే భాస్వరం శక్తితో సమానంగా ఉంటుంది.
7.భాస్వరం మొక్క చుట్టూ శక్తిని నిల్వ చేసి కిరణజన్య సంయోగక్రియలో మొక్కలకు సహాయపడుతుంది. మానవుల శరీరంలో 85% భాస్వరం ఎముకలు మరియు దంతాలలో కనిపిస్తుంది. ఇది శరీర వినియోగానికి మరియు శక్తిని నిల్వ చేయడానికి కూడా సహాయపడుతుంది.
ఎంత ఆశ్చర్యం.... నేలమట్టిలో ఉన్న మూలకాలు మానవ శరీర నిర్మాణంలోనూ మరియు శరీర అవసరతలు తీర్చడంలోనూ ఎంత పాత్రపోషిస్తున్నాయో కదా!
కాబట్టి మనిషి నేలమట్టి నుండి తీయబడ్డాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  

ఆయన ఊపిరి యొక్క శక్తిని చూసారా?  మన శరీరం అరోగ్యంగా ఉండడానికి ఏది ఎంత అవసరమో ఖచ్చితముగా  అమర్చబడ్డాయి.  ఇప్పుడు మనకు ఆక్సిజన్ శాతం తగ్గిందనుకోండి అది మనకు ప్రమాద హెచ్చరిక. 

పొటాషియం శాతం తగ్గిందనుకుందాం  అప్పుడు కూడా ప్రమాదమే. మన రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదకరం. పొటాషియం మన గుండె కండరాలు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు కారణమవుతుంది.

అందువల్ల ఆయన మన శరీరాన్ని లెక్కప్రకారం ఎక్కడాతేడా లేకుండా ఎంత బాగా నిర్మించారో అర్ధమవుతుంది కదా!

ఒక మట్టి ముద్దలోనికి ఆయన గాలి ఊదితే మనిషిగా మారాము కదా. మరి ఒకవేళ ఆ ఊపిరిని ఆయన వెనక్కు తీసుకుంటే ఆ మట్టి ముద్ద తిరిగి మట్టి గా అయిపోతుంది కదా! 

మరి అలాంటప్పుడు ఆ మట్టిని మనిషిగా ఎందుకు మార్చారు?  ఈ జీవన్మరణ పోరాటం ఎందుకు?

మరణించిన తరువాత మనము మట్టికి చేరిపోవడమే ముగింపా? కాదంటుంది దేవుని వాక్యం.

"ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. 1 కొరింధి 15:22,23" అంటే మట్టి నుండి మనిషి గా మారిన మనము మట్టిలోకి చేరడం అనగా నిద్రించడం అని అర్ధం. మరి ఆ నిద్ర పనుష్యులు లేపితే లేచేది కాదు గాని యేసయ్య తన దూతలతో పాటు వచ్చినప్పుడు ఆకాశంలో నుండి కడబూర  శబ్దం మ్రోగుతుంది. అప్పుడు మెలకువవస్తుంది వాళ్ళకి. ఆ తరువాత మరణం లేని శరీరంతో లేపబడి మహిమ శరీరం పొందుకొని ఆయన ప్రణాళిక ప్రకారం పరలోకంలోకి ప్రవేశిస్తామంట. ఎంత అద్భుతమైన  ప్రేమ సంకల్పం.

మన యొక్క మరణం, తిరిగి లేపబడడం, తీర్పు తరువాత పరలోకంలో ప్రభువు తో మరణం లేని సంతోష జీవితం....ఈ ప్రణాళిక  వాక్యాలను  క్రమ  పద్దతిలో ఒకసారి చదువుదామా? 

మరణం:

మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆయన వచ్చేటప్పటికి ఇంకా బ్రతికి ఉన్నవారు మహిమ శరీరంగా మార్చబడతారు. "ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 1 కొరింధి 15:51-52."

తీర్పు:

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీ 9:27

ప్రకటన 20:12-15 - 12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

ప్రభువుతో జీవితం:

ప్రకటన 20:11 - మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.

అంటే ప్రభువు తమ పోలికలో మనుషులను చేసుకొని వారికి స్వచిత్తమును ఇచ్చి ప్రేమతో తమ రూపులోనికి మార్చుకొని రాజులైన యాజక సమూహము గా చేసి ఆయనతో ఆ నిత్యపరలోకంలో మనము కూడా ఉండాలని ప్రభువు సంకల్పమై ఉన్నది. అందుకనే దేవుడు మనిషిని నోటిమాటతో కాక  స్వయంగా తన హస్తాలతో చేసారు. సృష్టిలో దేనికిలేని ఆ గొప్ప ధన్యత నరులమైన మనకు మాత్రమే ఇచ్చారు.  పరలోకంలో ప్రవేశించి ఆయనను చూస్తూ,  ఆయన మాటలు వింటూ ఆయననే ఆరాధిస్తూ జీవిస్తామంట. కన్నీరు గాని కలతలు గాని లేని  యుగయుగముల పరమానందాన్ని మనకు ప్రభువు బహుమతి గా ఇవ్వబోతున్నారంట. హల్లెలూయ!

మనిషి కూడా దేవుడిని చేసాడు! 

ఇంత గొప్ప ప్రణాళికలతో దేవుడు మనుషుల కొరకు సమస్తము సిద్దపరుస్తూఉంటే మరి ఆ మనిషి ఏంచేస్తున్నాడు?  ఆయన ప్రేమను పక్కన పెట్టి, ఆ పరిశుద్ధుని  ప్రణాళికలను విడిచిపెట్టి,  ఆయన చేతులలో మనిషిగా మారిన మట్టియైన మానవుడు ఆ మట్టిలోనే  దేవుని వెతుకుతున్నాడు. మట్టి బొమ్మను చేసి దేవునిగా ఆరాధిస్తున్నాడు. 

నిజానికి...  చూడను,  వినను,  మాట్లాడను శక్తిలేని ఆ మట్టి బొమ్మ కంటే,  ఆ మట్టిలోనే పుట్టి ప్రభువు ఊపిరితో ప్రాణం పోసుకున్న మనకే power ఎక్కువ కదా! మరి మట్టిలో,  చెట్టులో,  పుట్టలో దేవునిని  వెదకడం ఎంతవరకు న్యాయం? 

అనుక్షణం మనలను ప్రేమిస్తూ,  తన  కంటి పాపలా కాపాడుతూ మనకళ్ల ముందే కనిపిస్తున్న మనకన్న తండ్రిని కాదని వేరే వ్యక్తిని 'నాన్నా' అని పిలవగలమా?  ఆలా చేస్తే మన నాన్న గుండె తట్టుకోగలదా?  మనిషి అదే చేస్తున్నాడు. ఆయన ఏది చేయవద్దని ఆజ్ఞాపించారో ఖచ్చితంగా దానినే చేస్తూ నరక పాత్రుడౌతున్నాడు. "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. నిర్గమ కాండము 20:3-4."

  • కొంతమంది వారు చేస్తున్న పనిని దేవుడుగా భావిస్తారు.
  • మరికొంతమంది వారి కడుపే వారి దేవుడిగా భావించి దానిని తృప్తి పరచడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.
  • చాలా మంది వారి ధనమే వారి దేవునిగా భావిస్తారు. కష్టపడి పని చేసి మనం బ్రతకడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు గాని దానినే దేవుడు అంటే అది బుద్దిహీనత.
  • కొంత మంది వారు ఇతరులకు చేస్తున్న సహాయాన్ని బట్టి వారిని దేవునితో పోల్చుకుంటారు, అది కూడా correct కాదు. ఆయనను పోలి జీవిస్తూ ఆయన వెలకట్టలేని ప్రేమను ఇతరులకు చూపించాలి గాని,  అక్కడా ఇక్కడా దేవునిని చూపించే ప్రయత్నం చేయకూడదు. 
  • మనపనిని ప్రభువుగా భావించకూడదు   గాని, ప్రభువు కోసం పనిచేయాలి. 
  • ప్రతి పనిని, ఇతరులకు చేసే సహాయాన్ని ప్రభువుకు చేసినట్లే చేయాలి. తండ్రి మనలను ప్రేమించనట్లే మనము కూడా మనపొరుగువారిని ప్రేమించాలి. 

ప్రభువు కోసమే మనము బ్రతకాలని భక్తులు ఘోషిస్తున్నారు కదా!
పౌలు:
1. "కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. 1 కోరింథీయులకు 10:31"
2. "మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలస్సి 3:17"
3. "మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు. కొలస్సి 3:24"
4. "మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. రోమ 14:8"
5."మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింధి 19-20."
6. "మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హెబ్రీ 4:13".
మలాకి:
7. "నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు మలాకి 3:17."

కాబట్టి స్నేహితులారా, మనకొరకు ప్రభువు సిద్దపరచిన ప్రణాలికను అనుసరించి, భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరిగి యున్నాము  గనుకను ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము. 

ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.

ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.. 2 కొరింధి 5:8,10

   మనము దేవుని స్వహస్తాలలో మట్టినుండి ఎందుకు   నిర్మించబడ్డామో స్పష్టముగా అర్ధమైపోతుంది కదా! తండ్రి మట్టి నుండి మనిషిని చేసి అతనిని ఎంతో ప్రేమించి నిత్యము తనతో పాటు పరలోకంలో జీవించాలని మన కొరకు తన అనాది సంకల్పం చొప్పున ప్రణాలికను సిద్ధం చేసారు. 

ఈ విషయాన్ని గ్రహించిన మనము ఏంచేయాలి?  ఈ మట్టి ఒకదినాన మహిమ దేహముగా మార్చబడి  ఆయన మనకొరకు సిద్ధపరచిన పరలోక ప్రవేశము కొరకు ఆశతో కనిపెట్టుచూ ఈ క్షణబంగురమైన జీవితం కోసం కాక "నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము" అని పౌలు చెప్పినట్టు మనము కూడా ఆబాటలోనే నడుద్దామా? తప్పకుండా నడుద్దాం. 

కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

లేఖనాలలో ఇన్ని గొప్ప సంగతులను మనకోసం దాచిపెట్టిన ప్రభువునకు కీర్తనాకారుడితో పాటు మనము కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అంశాన్ని ముగించుకుందాము.

తండ్రీ....

 నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?

దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
                                   

 యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!

పై అంశమునకు సంభందించిన వచనాలన్నిటిని క్రింద ఇస్తున్నాను గమనించండి. మీరు కూడా ధ్యానము చేసి ప్రభువులో పరవశించి సర్వ సత్యములోనికి నడవాలని ఆశ పడుతున్నాను.

1. ఆదికాండము 1:26; 2:7; 6:6

2. 2 సమూయేలు 22:15

3.యోబు 4:9; 12:10; 15:30; 37:10; 14:3; 27:1-2; 32:8; 33:4; 34:14;  42:2

4. కీర్తన 18:15, 19; 22:10, 25:14; 28:5; 31:5;33:6 37:23; 68:20; 78:39; 135:17; 139:13-16

5. యెషయా 11:4; 30:28; 30:33; 42:5

6. యిర్మియా 1:5; 10:14; 11:20

7. యెహెఙ్కేలు 37:5

8. జెకర్యా 12:1

9. మలాకి 3:17.

10. అపొస్తలుల కార్యములు 17:25

11.1 పేతురు 2:9

12. 2 థెస్స 1:8

13. ప్రకటన 11:11; 2:10, 23

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...