17, మార్చి 2021, బుధవారం

10. నాయకుడు.. Part-1 (చరిత్రలోని మోషే)


 ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా,

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను.

సర్వశక్తి గల తండ్రియైన దేవుడు చేసిన సృష్టిని గురించి యెన్నో విషయాలు మనం ధ్యానం చేసాము కదా అవన్నీ మరలా జ్ఞాపకం  చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఒక క్రొత్త topic గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ సృష్టి అంతటినీ చేసిన సృష్టి కర్తకు ఒక సాధారణ మనిషి లోబడితే.... ఆయనతో ముఖాముఖీగా మాట్లాడితే ఆ అనుభవం....  ఆ జీవితం ఎలావుంటుందో ధ్యానించాలి అనిపించింది.

వెంటనే జమ్ముపెట్టెలో దొరికిన చిన్నబాబు జ్ఞాపకం వచ్చాడు. నిజమే అతను మోషేనే.  అతని గురించి లేఖనాలలో వెదికితే నిర్గమకాండము మొదలుకొని ప్రకటన గ్రంధం వరకు ఏదో ఒక సందర్భంలో  మోషే ప్రస్తావన (అంటే 31 పుస్తకాలలో 786 వచనాలలో) వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మార్గదర్శి మరియు లక్షలమంది ప్రజలను నడిపించిన ఆ గొప్ప నాయకుడు అయిన మోషే గురించి ధ్యానించవలిసిందే.

అయితే మోషే గురించి బైబిల్లో ఉంది కాబట్టి మనం ఇది నిజమని నమ్ముతాము. కానీ ఇది కల్పనాకధ అయ్యుండవచ్చు కదా! అని doubt పడేవాళ్ళకు చరిత్రను కూడా ముందుగా అధ్యయనం చేసి ఖచ్చితమైన అధారలతో నిరూపిద్దాం.

1. నాయకుడు... (చరిత్రలోని మోషే) Part -1

2. నాయకుడు.. (లేఖనాలలో మోషే)  Part-2

3. నాయకుడు.. (గమ్యం చేరని యాత్రికుడు) Part-3

చరిత్రలోని మోషే గురించి Part-1 ధ్యానం  చేద్దాం.

మోషే యొక్క చరిత్ర గురించి చాలా విభేదాలు వచ్చినప్పటికీ బైబిల్లో అతని గురించి వ్రాయబడిన ప్రతి సంఘటన ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించబడిన తరువాత బైబిలు పండితులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిఫ్టు నుండి ఇశ్రాయేలీయులయొక్క నిర్గమము ఖచ్చితముగా సంభవించిందని, అది కూడా మోషే అధ్వర్యంలోనే జరిగిందని అంగీకరిస్తున్నారు.

చరిత్ర ప్రకారం మోషే జీవించిన కాలం 1400 BC - 1201 BC.

 మోషే MOUZIZ  అని, "మోషే రబ్బూని" అని, అనబడుతూ ప్రపంచ చరిత్రలో అతి ముఖ్యమైన మత నాయకులలో ఒకరిగా పరిగణించ బడ్డాడు.

ఎవరు...ఏమనుకుంటున్నారు?

జుడాయిజం, క్రైస్తవ మతము, ఇస్లాం మరియు బహాయి మతాలు మోషే దేవుని ముఖ్యమైన ప్రవక్త మరియు ఏక ధర్మ విశ్వాసం యొక్క స్థాపకుడు అని పేర్కొన్నారు.  బైబిలు యొక్క మొదటి ఐదు పుస్తకాలైన తోరాను "దేవుని నుండి" పొందుకొని ప్రజలకు అందించడం వలన మోషే ఇశ్రాయేలీయుల నాయకుడు మరియు చట్టసభ సభ్యుడు అని పిలువబడ్డాడు.

బైబిలు:  మోషే కధ నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము అనే పుస్తకాలలో చెప్పబడింది. అతను బైబిలు అంతటా ప్రస్తావించబడ్డాడు. ప్రత్యేకించి క్రొత్తనిబంధనలో చాలా తరుచుగా ఉదహరించబడిన ప్రవక్త.

ఇస్లాం మతము: ఖురాన్లో కూడా మోషే ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. బైబిల్లో మాదిరిగానే ఖురాన్లో కూడా  మోషే దైవిక ఉద్దేశ్యాలను మానవులకు అందించడానికి మధ్యవర్తిగా నిలువబడిన వ్యక్తిగా వారు బావిస్తారు.

ఈజిప్టు చరిత్రకారుడు Manetho:  (3 వ శతాబ్దం BC) ఇతను Osarsiph  అనే ఒక ఈజిప్టు కధ చెప్పాడు. ఆ గురువు ఈజిప్టు రాజుపై తిరుగుబాటు చేసి కొంతమంది ప్రజలను మరొక ప్రాంతానికి నడిపించాడు. అలాగే అక్కడున్న ఈజిప్ట్ మతం యొక్క బహుదేవతారాధనను    తిరస్కరించి   దేవుడు ఒక్కడే అని ఏకాధర్మ విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటాడు. అలాగే మనుష్యులెవరూ ఉచ్చరించలేని పేరు కలిగిన దేవుణ్ణి అతను నమ్మాడు అని ఆ చరిత్రకారుడు చెప్పాడు. అతను ఖచ్చితంగా మన మోషే గారే కదా!

  • ఈజిప్ట్ యొక్క రాజవంసాన్ని పాలించిన 19వ రామసైడ్ కాలంలో, 13వ శతాబ్దం నాటి నిర్గమకాండమునకు మద్దతు నిచ్చే సాక్ష్యాలు చాలా వెలుగు చూసాయి.
  • ఈజిప్ట్ గ్రంధాలు, కళాఖండాలు మరియు పురావస్తు ప్రదేశాలను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 13 వ శాతబ్దం నుండి బైబిల్లో చెప్పబడిన ప్రతివిషయం ఖచ్చితమైనదని నిరూపించబడుతుంది.
  • ఉదాహరణకు ఈజిప్ట్ నుండి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో కనిపించే 3 ప్రదేశాల పేర్లు రామేసైడ్ కాలం (BC 13 -11BC శతబ్దాల) నుండి బైబిల్ పేర్లు పితోమ్, రామసేన్, ఎంసుఫ్ (ఎర్ర సముద్రం లేదా రెడ్ సీ) ఈజిప్ట్ స్థల పేర్లు ఈజిప్ట్ గ్రంధాలలో  కనిపిస్తాయి.

సీనాయి కొండమీద మోషేకి ఇవ్వబడిన పది ఆజ్ఞల రాతిపలకలు:

మోషే చరిత్రను రుజువు చేసే మరొక విలువైన ఆధారం 10 ఆజ్ఞల రాతిపలకలు... ఇంకా ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి?  అసలు ఏమి జరిగింది?

1. మోషే సీనాయి పర్వతం మీద నుండి తెచ్చిన మొదటి రాతి పలకలను బంగారు దూడను చూసినప్పుడు అతను కిందకి విసిరేసాడు. అతను దేవుని ఆజ్ఞ ప్రకారం    సీనాయి  పైకి తిరిగి వెళ్ళాడు. అప్పుడు అతనికి  రెండవ set ఇవ్వబడింది.

2. రెండవ set రాతి పలకలు, వాటిపై చెక్కబడిన పది ఆజ్ఞలతో  నిబంధన మందసంలో దాచబడ్డాయి.(ద్వితీయ. 10:1,2 హెబ్రీ 8:4-5) (1 సమూయేలు 3:3 మరియు 1రాజులు 8:11).

అయితే క్రీస్తుపూర్వం 587 లో యెరూషలేములోని మొదట, ఆలయంను స్వాధీనం చేసుకున్నప్పుడు, యిర్మియా ప్రవక్త మరియు కొంతమంది మనుష్యులు కలిసి మందసమును ఎడారిలోకి తీసుకువెళ్ళి పాతిపెట్టాడని మరియు దానిలోని విషయాలు ఈ రోజు వరకు దాగి ఉన్నాయని ఈ వచనాల ఆధారంగా తెలుస్తుంది (2 మక్కబీస్ 2:4)  (2 మాక్. 2: 5).

3. ఆ రాతిపలకలు భద్రం చేయబడిన ప్రదేశాన్ని క్రీ.శ 400 మరియు 600 మధ్య రోమన్లు చేత నాశనం చేయబడిన తరువాత కొన్ని శతాబ్దాలుగా శిలశిధిలాలలో ఈ రాయి కూరుకుపోయిందని పురాతన నాణేల డైరెక్టర్ డేవిడ్ మైఖేల్స్ చెప్పారు.

ఇది బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలను దేవుడు తన వేలితో రాసినటువంటి చెక్కుచెదరకుండా ఉన్న రాతి కాపీ.

4. ఇశ్రాయేలీయుల  యొక్క "జాతీయ నిధి" గా వర్ణించబడిన ఈ రాయిని మొదటిసారిగా 1913 లో ఇజ్రాయెల్‌లోని యవ్నెహ్ సమీపంలో ఒక రైల్రోడ్ స్టేషన్ కోసం త్రవ్వకాలలో వెలికి తీశారు. "దానిని కనుగొన్న కార్మికులు దాని ప్రాముఖ్యతను గుర్తించక పోవడం వలన స్థానిక అరబ్ వ్యక్తికి విక్రయించారు. అతను తన లోపలి ప్రాంగణానికి దారితీసే గది యొక్క


ప్రవేశద్వారం దగ్గర రాయిని అమర్చాడు, శాసనం ఎదురుగా ఉంది" అని మైఖేల్స్ చెప్పారు.

  • ముప్పై సంవత్సరాల తరువాత, 1943 లో, ఆ వ్యక్తి కొడుకు మునిసిపల్ పురావస్తు శాస్త్రవేత్త వై.కప్లాన్కు రాయిని అమ్మేసాడు.
  • "అతను వెంటనే అది అరుదైనదని మరియు చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించాడు, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి హెరిటేజ్ పురాతన నాణేల డైరెక్టర్ మైఖేల్స్ కు అప్పగించాడు.
  • "ఆ రాతి పలకలమీద ఉన్న అక్షరాల యొక్క సూపర్ ఫైన్ విట్రిఫికేషన్ అధ్యయనం చేయడానికి వారిని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్లారు. శాసనం యొక్క మధ్యభాగం యొక్క కొన్ని అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి - కాని సరైన లైటింగ్ కింద ఇప్పటికీ చదవగలిగే విధంగానే ఉన్నాయి."

5."రాతిపలక  యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలోని మూడు గొప్ప మతాలకు(జుడాయిజం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం) ఆధారం అయిన ఆజ్ఞల యొక్క లోతైన మూలాలు మరియు శాశ్వత శక్తికి నిదర్శనం" అని హెరిటేజ్ పురాతన నాణేల డైరెక్టర్ డేవిడ్ మైఖేల్స్ అన్నారు. అక్కడ పురావస్తుశాఖవారు బైబిల్లో చెప్పబడిన సీనాయి సంఘటనను రుజువు చేస్తున్నట్లుగా, రాతికి రెండు వైపులా రాసిన లేఖలను దేవుని వేలుతో రాయిలో కాల్చారు మరియు లేజర్ కూడా అలా చేయలేదని వారు అంగీకరించారంట.

6. రెండు అడుగుల చదరపు (0.18 చదరపు మీటర్), 115-పౌండ్ల (52 కిలోల) పాలరాయి స్లాబ్‌న సమారిటన్ అని పిలిచే ప్రారంభ హీబ్రూ లిపిలో చెక్కబడి ఉంది. ఆ రాతిపలకను చాలాకాలం వరకు పురాతన పట్టణమైన పాలస్తీనాలోని జబ్నీల్ పట్టణంలో సమారిటన్ ప్రార్థనా మందిరంలో ఉంచారు. ఇప్పుడు అది ఆధునిక ఇజ్రాయెల్‌లో యావ్నెహ్ అని మైఖేల్స్ అర్ధం చేసుకున్నాడు.

ఆరాతి పలకల ప్రాముఖ్యతను గుర్తించిన తరువాత, కప్లాన్ అనే ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, అప్పటి ఇజ్రాయెల్ యొక్క రెండవ అధ్యక్షుడైన యిట్జాక్ బెన్-జ్వినిని, దాని రుజువును పరిశోధించడంలో సహాయపడమని కోరాడు. ఆ తరువాత వారు రాతి పలక యొక్క ఆవిష్కరణ కథను వివరిస్తూ దాని చారిత్రక సందర్భం గురించి ముఖ్య సమాచారాన్ని ఒక అకాడెమిక్ పేపర్‌లో ప్రచురించారు.

7. కప్లాన్ చివరికి ఈ రాయిని రబ్బీ సాల్ డ్యూచ్ అనే అమెరికన్కు విక్రయించాడు, అతను దానిని యుఎస్ కి తీసుకెళ్ళి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లోని తన లివింగ్ తోరా మ్యూజియంలో ప్రదర్శించాడు .

ఇజ్రాయెల్ "నేషనల్ ట్రెజర్" గా వర్ణించబడిన ఆజ్ఞలు గల రాతి పలకలను తీసుకువెళ్లడాన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (IAA) 2005 లో జారీ చేసిన ప్రత్యేక అనుమతి కింద ఆమోదించింది. 10 ఆజ్ఞలు రాయబడిన మొట్టమొదటి రాతి వెర్షన్ $ 850,000 కు అమ్ముడైంది.

  •  దాదాపు చాలామంది చరిత్రకారులు మోషే చరిత్ర లేదని చెప్పారు. మరి బైబిల్లో ఉన్న మోషే చరిత్ర లేకుండా, చారిత్రక 10 ఆజ్ఞల రాతి పలకలు ఉండవు కదా. ఒక్కమాటలో చెప్పాలంటే, రాతి పలకలు బైబిల్లో మోషే  కథను ధృవీకరిస్తున్నాయి.
  • ఈ ఆవిష్కరణ బైబిల్ వచనం యొక్క చారిత్రక విశ్వసనీయతకు గొప్ప నిర్ధారణ. ఒకప్పుడు చాలా మంది ఇరాక్‌లో నివసించారని కూడా ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నేడు, ఈ వ్యక్తులలో కొంతమంది జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి: యూదులు, క్రైస్తవులు, మాండెయన్లు (జాన్ బాప్టిస్ట్ యొక్క చివరి అనుచరులు) మరియు యాజిడిస్, పురాతన ప్రజలు, వారి నమ్మకాలు జొరాస్ట్రియనిజం, పర్షియా యొక్క ఇస్లామిక్ పూర్వ మతం, ప్రారంభ క్రైస్తవ మతం మరియు జుడాయిజం. ఈ జాతిలో ప్రాణాలతో బయటపడిన వారందరూ ఇప్పుడు ఊచకోతలు, సిలువలు, అత్యాచారం మరియు శిరచ్ఛేదం ఎదుర్కొంటున్నారు.
  • పురావస్తు పరిశోధనలు.. బైబిల్లో చెప్పబడిన విషయాలు చారిత్రాత్మకంగా ఖచ్చితమైనవని ధృవీకరించాయి.

ఇంత సాక్ష్యం మనకళ్ల ముందు కనిపిస్తూ ఉంటే మోషే గురించి అతనికి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మనకు ఉందా?

సీనాయి పర్వతం:

దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిచి 40 రాత్రింబగళ్ళు అతనితో మాట్లాడినట్లు బైబిలు చెబుతుంది.

నిర్గమ కాండము 19:18 లో యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను."

మరి దాని ఆధారం మనకు ఇప్పుడేమైన కనిపిస్తుందా? 

స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సీనాయి పర్వతాన్ని

చూడండి. దానిమీద పరిశోధనలు జరిగిన తరువాత అగ్ని చేత కాల్చబడినట్లు స్పష్టంగా తెలియబడింది.

చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ప్రకృతి గాని, కాలం గాని మరుగు చేయలేని సజీవుడు మన ప్రభువు.  ఆయన చేసిన ఏకార్యము మరుగున పడడానికి వీలులేదు... ఎట్టి పరిస్థితిలోనూ పడదు... పడలేదు.

బైబిల్లో ఉన్న సంఘటనలన్నీ చారిత్రక రుజువులతో మీముందు ఉంచాలని ఈ blog start చేశాను. ఇప్పటి వరకు 10 articles రాసాను. నోవహు ఓడతో ప్రారంభించి మోషే వరకు వచ్చాము.  ఒక్కొక్క topic తీసుకొని బైబిల్ లోను మరియు చరిత్రను study చేస్తూ ఉంటే ఆనందంతో ఆశ్చర్యం కలిగించే ఆధారాలు ఎన్నో తెలుస్తున్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం.

వీటిని చదువుతూ నేను విశ్వాసంలో బలపడుతూ మీరు కూడా బలపడాలని ఆశపడుతున్నాను.

చరిత్ర సాక్ష్యం కంటే విలువైన సాక్ష్యం ఇక్కడ ఉంది. అది మనమే. ఈ ఆధారాలు ఏమి చూపించకపోయినా మన తండ్రి ప్రేమకు మనము ఎప్పుడో బందీలైపోయాము.   ఆయన ప్రేమకు నిండు వందనం.

చరిత్రలో మోషే గురించి ఏవిధంగా ఉందో తెలుసుకున్నాము కదా ఇంక లేఖనాలలో మోషే గురించి ధ్యానం చేస్తూ మళ్ళీ కలుస్తాను.

May God be with you.

సేకరణ: 

1. ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ యొక్క నిర్గమము యొక్క సాక్ష్యాల గురించి మరింత తెలుసుకోవడానికి , బైబిల్ ఆర్కియాలజీ రివ్యూ యొక్క మే / జూన్ 2016 సంచికలో “ఎక్సోడస్ ఎవిడెన్స్: ఒక ఈజిప్టు శాస్త్రవేత్త బైబిల్ చరిత్రను చూసాడు” అనే పూర్తి కథనాన్ని చదవండి .

2.మరింత సమాచారం కోసం దీనిని చూడండి: http://www.haaretz.com/life/archaeology/.premium-1.639822

 

12 కామెంట్‌లు:

  1. Very nice. Good information about Moses. Happy to learn Moses in history. Waiting for part 2 and part 3.

    రిప్లయితొలగించండి
  2. Thank you very much sister.. I will do my best to publish 2 and 3 soon.

    రిప్లయితొలగించండి
  3. Historical information in our hands. . Superb vadina. .
    Thank you Jesus. .

    రిప్లయితొలగించండి
  4. Historical information at the ease of our hands. . Superb vadina . .
    Thank you Jesus. .

    రిప్లయితొలగించండి
  5. Nice work.Thanks for sharing historical evidences.. Good bless you

    రిప్లయితొలగించండి
  6. Good information with historical evidence dear...keep going on..may god be with you..

    రిప్లయితొలగించండి

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...