ప్రియమైన స్నేహితులారా,
ప్రభువు కృప మీతో ఉండు గాక!

ఆదినమే కాదు ఇంకా చూస్తే బైబిల్లో అత్యధిక కాలం బ్రతికిన వ్యక్తి వయస్సు 969 సంవత్సరాలు. ఆదాము 930 సంవత్సరాలు, నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ దినం లోనే చనిపోవలసిన మనిషి ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నాడు??
ఇక్కడ ఒక విషయం మనము తెలుసుకోవాలి. పరలోకంలో ప్రభువు లెక్కలు... భూమిమీద ఉండే మనిషి లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
"2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి."
అనగా భూమి మీద మనిషి దినాలు గాని, మనిషి కొలిచే కొలత గాని ప్రభువు దృష్టికి చాలా తక్కువ అనమాట. అందుకే ఆయన మనమీద కోపించేటప్పుడు మనలెక్కప్రకారం... దయ చూపించేటప్పుడు ఆయన లెక్కప్రకారం చూస్తారనే కదా దీని అర్ధం. ఆయన తన లెక్కప్రకారం గనుక మనలను శిక్షిస్తే ఏ ఒక్కరు మిగలరు.
అందుకే తిను దినము అంటే ఆయనకు వెయ్యి సంవత్సరాలు ఒక దినం కదా ఆ లెక్కప్రకారం మనిషి జీవించాడు. వెయ్యి సంవత్సరాలు దాటి బ్రతికినవారు ఎవరు లేరు కదా! అంటే ఆయన లెక్కలో తిను దినములోనే మనిషి చనిపోయాడు. ఆ అతిక్రమము మనకు కూడా వచ్చింది గనుక మనము కూడా ఆ దినములోనే చనిపోతున్నాము. "ఇంత కన్నా ఏంకావాలి ఆయన ఉన్నతమైన ప్రేమకు నిదర్శనం??"
"కీర్తన 30:5. ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును."
2. ఏదెను ఇప్పుడు ఎక్కడ ఉంది?
ఆదికాండంలో ఈతోట ఎక్కడ ఉందో పూర్తి వివరణ లేదు గాని అది తూర్పున ఉన్నట్లుగా ఉంది. ఆది. 2:8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
ఏదెనులో తూర్పున ఆ తోట వేసారో లేక ఏదెనే తూర్పున ఉందో మనకు స్పష్టంగా వివరించబడలేదు గాని, ఒక clue ఆధారంతో పరిశోధనలు కొనసాగాయి. అదే ఏదెను నుండి బయలుదేరిన నది. ఆధారాలు స్పష్టంగా లేకపోవడం వలన ఏదెను ఎక్కడ ఉండేదో గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ అనేక మతపరమైన సంస్థలు దానిని map లో గుర్తించడానికి చాలా ప్రయత్నాలు చేసారు.
పర్షియన్ గల్ఫ్ లోని ముఖ్యబాగమైన దక్షిణ మెసొపొటేమియాలో (ఇప్పుడు ఇరాక్) మరియు అర్మేనియాలో... టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదులు సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. అయితే అసలు ఏదెను.. లెబనాన్, ఇరాక్, పెర్షియన్ గల్ఫ్ లేదా ఆఫ్రికాలో ఉండవచ్చునని చాలామంది నమ్ముతారు.
అయితే మనం ఇప్పుడు యెహెజ్కేలు చెప్పిన వివరణ జాగ్రత్తగా వింటే ఏదెను యెక్కడుండేదో మనకే స్పష్టముగా అర్ధమైపోతుంది.
"యెహెజ్కేలు 28:13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి."
"యెహెజ్కేలు 28:14 అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి."
ఆదికాండములో మరుగు చేయబడి యెహెజ్కేలులో మాత్రమే చెప్పబడిన ఈ "దేవుని పర్వతం" యూదుల లెక్క ప్రకారం యెరుషలేములోనే ఉంది. అదే "సియోను పర్వతం" Mount Zion. దీనిని బట్టి ఏదెను తోట యెక్కడ ఉండేదో స్పష్టమైపోతుంది కదా!
2. ఏదెను కొలత ఎంత?
ఏదెను తోట ప్రాథమికంగా లెబనాన్ ఈశాన్య పర్వతాల నుండి ఉప్పు సముద్రానికి దక్షిణాన మరియు జోర్డాన్ నదికి తూర్పున మెడిటరేనియన్ దక్షిణానికి ఈజిప్ట్ వరకు ఉంది. "ఇది దేవుని దృక్కోణం నుండి ఒక తోట కానీ మానవుని కోణం నుండి ఒక పెద్ద జాతీయ ఉద్యానవనం".
తోట పెంపకం మరియు సంరక్షణ మనిషికి అప్పగించబడిన భాధ్యత. ఏదెను చెట్లు మరియు మొక్కలలో సుందరమైన అందాన్ని అందించే వాటితో పాటు అనేక రకాల ఆహారాన్ని అందించేవి కూడా ఉన్నాయి. (ఆది 2: 9, 15) ఈ వాస్తవం మాత్రమే తోట గణనీయమైన పరిమాణంలో విస్తరించి ఉందని సూచిస్తుంది.
ఈ తోట అనేక రకాల జంతువుల జీవితానికి సరిపోయేంత పెద్దది, వాటన్నిటికీ పేర్లు పెట్టడానికి దేవుడు వాటిని ఆదాము దగ్గరకి రప్పిస్తారు.
ఏదెను తోట చుట్టూ సహజంగా ఏర్పడిన పర్వతాలే ప్రహరీ గోడలాగా అలంకరించబడి ఉంటాయి. యెహోవా వారిని తోట నుండి బయటకు పంపినప్పుడు తిరిగి రాకుండా ఉండటానికి కెరీబులను తోట “ప్రవేశద్వారం” వద్ద మాత్రమే ఎందుకు ఉంచాల్సి వచ్చిందో ఇది వివరిస్తుంది. ఉదాహరణకు, ఇది పర్వత భూభాగం చుట్టూ విశాలమైన లోయలో తోట చుట్టూ సహజ గోడలాగా ఏర్పడి ఉండవచ్చు.
"ఆది. 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను."
2:11. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.
2:12. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును.
2:13. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.
2:14. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు.
ఇలా తోట మొత్తాన్ని తడపడానికి పంపబడిన నాలుగు నదులను అంచనాగా తీసుకొని ఏదెను తోట ప్రాథమికంగా 200 x 150 చదరపు మైళ్లు అయిఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఆగ్నేయ ఇరాక్‌లోని మార్ష్ అరబ్బులు టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల సంగమం వద్ద జలమార్గాలను దాటి వెయ్యేళ్లు గడిపారు. అయితే, కొన్ని చోట్ల ఆనదులు బలవంతముగా పొడినేలలుగా మార్చబడ్డాయని ఆధునిక పరిశోధన చెబుతుంది.
1995 నాటికి, పచ్చటి విస్తరణలు పోయాయి. 2001 నాటికి కొన్ని వందల చదరపు మైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2003 లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పొరుగున ఉన్న ఇరాన్‌తో యుద్ధం తరువాత కొన్ని సంవత్సరాలకు చిత్తడి నేలలను తడపడానికి డ్యామ్‌లను ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశమంతా నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది.
కొందరు ఈ చిత్తడినేలలను బైబిల్లో ఉన్న ఏదెను తోటగా పరిగణిస్తారు. అది 2016లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరు పొందింది. చారిత్రక చిత్తడి నేలల్లో పురోగతిని satilites ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
3. ఏదెను తోట ఇంకా ఉందా?
ఏదెను తోట ఇక్కడ ఉండిఉండవచ్చు..అక్కడ ఉండిఉండవచ్చు అనే అంచనాలే తప్ప అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవ్వరూ కనుగొనలేక పోయారు.
"ఆదికాండము 3:24 అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను."
దేవుని ఆజ్ఞను దిక్కరించినందుకు మనిషిని ఆ తోటనుండి బహిష్కరించిన తరువాత మనం మాత్రం యెలా కనుగొనగలం?
ఆదికాండము మొదటి రెండు అధ్యయాలను గమనించిన తరువాత నాకు అర్ధమైన విషయం ఏమిటంటే... "ఏదెను తోట అనేది మొదటి మానవుని పాఠశాల". దేవుని ప్రేమను, ఆయన సహవాసాన్ని పొందుకొని ఇష్టపూర్వకముగా ఆయనను చేరుకోవడానికి వారికొరకు మాత్రమే ఏర్పాటు చేయబడిన ప్రణాళిక.
దేవుడు ఆదామును పిలిచి ఈ మహాద్భుతమైన ఏదెను వనాన్ని అప్పగించి దానిని ఏలమన్నాడు. అక్కడ ఉన్న సమస్త జంతువులకు పేర్లు పెట్టమన్నాడు. ఏ కష్టం లేకుండా దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ ఆనందించమన్నాడు. అంటే దేవుడు అతనిని ఈ భూమి మీద ఒక రాజుగా నియమించాడనమాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి