ప్రియమైన స్నేహితులారా,
ప్రభువు నామంలో మీ అందరికి వందనములు.
మనము బైబిల్ చదవడం start చెయ్యగానే ఎన్నో ప్రశ్నలు మనస్సులోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏదెను తోటలో హవ్వ ఆదాము గురించి చదివితే కొంతమంది అక్కడే ఆగిపోతారు. మరికొంతమంది, ఇలాగే ఎందుకు జరిగింది? మరోలా జరగవచ్చు కదా! అనుకుంటూ కాస్త భాధపడుతూ మెల్లగా చదవడం continue చేస్తారు.
ప్రశ్నించే కంటే ముందు మనము తెలుసుకోవాలని దేవుడు దాచివుంచిన విషయాలు చాలాఉన్నాయి. ఏదెను గురించి బైబిల్లో మనము తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని లేఖనాలను అధ్యయనం చేసాక నాకు అర్ధమయ్యింది.
దేవుడు ఏదెనులో ప్రత్యేకముగా ఒక తోట వేసారు అంటే, అందునా అది "దేవుని తోట" అని ప్రత్యేకముగా పిలువబడింది అంటే అది యెలా ఉండి ఉంటుందో అని యెప్పుడైనా అలోచించారా?
ఏదెను గురించి జాగ్రత్తగా observe చేస్తూ ఉంటే నాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. No doubt మీతో కూడా share చేస్తాను.

మొదటి మానవులైన హవ్వ ఆదాము జీవించిన మొట్టమొదటి అద్భుతమైన ప్రదేశమే ఈ ఏదేను తోట.
ఏదెనులో దేవుడు వేసిన తోట ఎలా ఉండేది?
- సృష్టికర్త దృష్టికి చాలాబాగుంది అని అనిపించిందంటే అది ఖచ్చితముగా మన ఊహకు అందనంత అందముగా ఉండే ఉంటుంది. అంటే అది ఒక అద్భుతం.
- నిరాకారమైన భూమికి రూపము ఇచ్చారు. దానిని అందమైన ప్రకృతితోను, పక్షులు, జంతువులు, జలచారాలతోను అందముగా అలంకరించి దానిని చూచి చాలా సంతోషించారంట, అది మంచిదిగా ఆయనకు అనిపించిందంట. అలాగే అక్కడ నాటిన ప్రతి చెట్టు చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు యోగ్యమైనవిగా ఉన్నాయంట. (ఆది. 2:9. మరియు దేవుడైన యెహోవా చూపు నకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను). అంటే మనము ఆతోటలోకి అడుగుపెట్టామనుకోండి... ఇక ప్రతి మొక్క, ప్రతి చెట్టు వైపు చూస్తూ అబ్బ... ఎంతబాగుందో అని ఆశ్చర్యపోతూ ఉంటామనమాట. "యెషయా51:3 యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును."
- ఏనాడూ వాన కురవని, సేద్యపరచని నేలమీద మంటిని తీసుకుని నరునిగా తయారుచేసి, ఆ మట్టి బొమ్మను తన దివ్యమైన ముఖమునకు దగ్గరగా పెట్టుకొని తన నోటితో జీవవాయువుని ఊదగా ఆ బొమ్మ జీవించే మనిషిగా అయ్యాడు.
- ఆమనిషిని తీసుకొని అందమైన ఈ ఏదెను తోటలో ఉంచినప్పుడు ఆదాము ఒక్కొక్క చెట్టును చూస్తూ పరవశించిపోతూ ఉండిఉంటాడు. ఆ time లో దేవుడు ఆదామును పిలిచి ఇక్కడ ఉన్న పండ్లన్నీ ఆహారమునకు యోగ్యమైనవే. నువ్వు నిరభ్యంతరముగా తినొచ్చు. కాని మంచి చెడ్డల తెలివినిచ్చు ఒక చెట్టును చూపించి ఈ చెట్టు పండు మాత్రము ముట్టుకోవద్దు. అది తింటే నువ్వు చచ్చిపోతావు అనిచెప్పారు.
- అందులో బాధపడడానికేముంది? అన్ని చెట్లు చూపుకి రమ్యముగా, వాటిపండ్లు మధురముగా ఉన్నప్పుడు... అలాంటి అందమైనదే మరో చెట్టు... దాని పండ్లు తింటే చచ్చిపోతాము అని తెలిసినప్పుడు దానిని తినవలసిన అవసరం ఏముంది? అయ్యో దీనిని miss అయ్యాము అని feel అవ్వాల్సిన పనే లేదుకదా!
- అలాగే అనుకున్నాడు ఆదాము. దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నాడు. కాని అదే కదా మరి సాతాను తట్టుకోలేని విషయం. మెల్లగా enter అయ్యాడు. హవ్వను ప్రలోభపెట్టాడు. అంతే.... అక్కడ ఉన్న ప్రతి చెట్టు అందంగానే ఉంది. కాని హవ్వ దేవుడు ఏ చెట్టు అయితే ముట్టొద్దు అన్నాడో ఆ చెట్టును చూసి చాలా బాగుంది అనుకుంది. (స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను; ఆది 3:6). మోసానికి గురయ్యింది. ఆజ్ఞను అతిక్రమించింది.
ఆచెట్టును ముట్టుకుని దాని పండు తింటే ఇంత ఉపద్రవం మీదకు వస్తుందన్నప్పుడు దేవుడు ఆ చెట్టుని అక్కడెందుకు పెట్టారన్నది మన సందేహం కదా!
దేవుడు మనిషిని చేసిన తరువాత తన ప్రేమనంతా కనపరచి, ఆ ప్రేమను పొందుకొని ఇష్టపూర్వకముగా తన మాటకు లోబడి ఆయనతో సహవాసం చేసి, నిత్యము ఆయనతోపాటు మనము ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. అందులో భాగమే ఈ చెట్టు. చెట్టులో యే విశేషమూ లేదు గాని, ఆయన ఆజ్ఞకు లోబడడమే విషయం.
ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం ఏముంది?
మోసం. అవును మోసమే. హవ్వమ్మకు జరిగిన మోసం. ఈ రోజుకి మనము కూడా ఎన్నో విషయాలలో అలాగే మోసపోతున్నాము.
తోటంతా చూపుకి రమ్యముగా ఉన్నప్పటికీ దేవుడు వద్దని చెప్పి అజ్ఞాపించిన చెట్టుని చూపించి అదొక్కటిమాత్రమే రమ్యముగా ఉన్నట్లు సాతాను హవ్వమ్మను బ్రమింపచేసినట్లుగానే....
1. దేవుడిచ్చిన సంతోషం, ప్రేమ మన చుట్టూ ఉండగా... నువ్వు ఏదో miss అయ్యావు అన్నట్లు ఈ లోక ప్రేమలవైపు నడిపించి దేవుని ఉద్దేశం నుండి దూరమయ్యేలా చేస్తున్నాడు.
2. నిత్యమైన బంగారు వీధులలో నడవబోతుండగా... ఆశాశ్వతమైన ఈ లోక బంగారం కోసం పరితపించేలా చేస్తున్నాడు.
3. ప్రభువుతో గడపవలసిన విలువైన సమయంలో అంతకన్నా interesting విషయాలు చాలా ఉన్నాయి mobile పట్టుకో అంటాడు. అలా మోసపోయే ప్రభువుతో సహవాసాన్ని కోల్పోతున్నాము. ఇలా ఎన్నో ఉన్నాయి.
"యోహాను 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు."
కాని ఒక్కటి మాత్రం నిజం.
ఈ లోకంలో ఉండే ఆనందం అంతా యేసులో దొరుకుతుంది. కాని యేసయ్యలో ఉండే ఆనందం మాత్రం ఈ లోకంలో దొరకదని ఆయన ప్రేమలో జీవిస్తున్న మనందరికి తెలుసు.
నిత్యము మన హృదయాన్ని వాక్యముతో నింపుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రలోబాలనుండి తప్పించుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించినప్పుడు ఆకువాడని చెట్టులా ఉంటాము.

ఏదెను గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తక్కువ time gap లో publish చెయ్యాలని చిన్న చిన్న parts గా divide చేసి మీ ముందుకు తెస్తున్నాను.
1. దేవుడు ఆ చెట్టు పండు తింటే ఆ రోజే చచ్చిపోతావు అని ఆదాము తో అన్నారు కదా మరెందుకు ఆ రోజు చావలేదు?
2. ఏదెను ఇప్పుడు ఎక్కడ ఉంది? దాని size ఎంత?
ఆధారాలతో మళ్ళీ కలుస్తాను. దేవుని కృప మీతో ఉండుగాక.