29, జూన్ 2021, మంగళవారం

12. నాయకుడు.. (లేఖనాలలో మోషే) Part-2

 

తన వాత్సల్యమును బట్టి "ప్రతి దినమును" మనకు ఒక బహుమతిగా ఇస్తున్న దేవాతి దేవునికి వందనాలు.

ప్రియమైన స్నేహితులారా,

మోషే గురించి మొదటి article నుండి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు కూడా చరిత్రలోని మోషే గొప్పతనం విని దేవున్ని స్తుతించారని నమ్ముతున్నాను. మోషే గురించి చరిత్రలోనే ఇంత గొప్పగా ఉందంటే ఇంక బైబిల్లో చూస్తే ఆ నాయకుడి జీవితం యెలా ప్రారంభమయ్యిందో, అతని బలమేంటో? బలహీనత ఏమిటో అతని వెనుక ఉన్నది యెవరో స్పష్టంగా అర్ధమవుతుంది.  అతని మీద ఇప్పుడు చాలా గౌరవము పెరిగింది.

మోషే గురించి బైబిల్లో నుండి అనేక విషయాలు మనం చిన్నప్పటి నుండి విన్నవే అయినా ఒకసారి మరలా నెమరు వేసుకుందాము.  యెందుకంటే అతని జీవితమంతా పోరాటమే. కాని ప్రతిసారి గెలుస్తూనే ఉన్నాడు. చనిపోయే క్షణం వరకు వెనక్కి తిరిగి చూడలేదు.

మనం కూడా ఇప్పుడు పోరాటంలో ఉన్నాము.  యెక్కడయినా ఓడిపోయి ఆగిపోతామేమో అనే భయంలో ఉన్నాము.  ఈ సమయంలో ఇతను మనకి సహాయపడగలడేమో చూద్దాం.  అతనిని అడిగి యెవరి సహాయంతో నడిచాడో...యెవరి వైపు చూస్తూ బ్రతికాడో తెలుసుకుని మనం కూడా follow అయిపోదాం.

1. నాయకుడు... (చరిత్రలోని మోషే) Part -1  https://biblestudynavigatortelugu.blogspot.com/2021/03/10-part-1-new.html -     link click చేస్తే first topic దొరుకుతుంది.

2. నాయకుడు.. (లేఖనాలలో మోషే) Part-2

3. నాయకుడు.. (గమ్యం చేరని యాత్రికుడు) Part-3

బైబిల్లో మోషే గురించి 31 పుస్తకాలలో 786 వచనాలలో కనిపిస్తుంది. అందులో మనకి అవసరమైన విషయాలు జాగ్రత్తగా తెలుసుకుందాం.
First topic లో మోషే గురించి ఇతర మత గ్రంధాలలోనూ అలాగే చరిత్ర లోను ఏమనుకుంటున్నారో పరిశీలన చేసాము.  అయితే మన ప్రామాణిక గ్రంధమైన Bible ఏమి చెబుతుందో అది మనకి చాలా important. బైబిల్లో మోషే చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే బాగా గమనిస్తే అందరికంటే ఎక్కువగా దేవుడు మోషేతోనే మాట్లాడారు.

ముందుగా బైబిల్లో మోషే ఎన్నివిధాలుగా సంభోదించబడ్డాడో చూద్దాం.

1. మోషే  -  మొదట ఫరో కుమార్తె, నీటినుండి తియబడ్డాడు గనుక అతనికి మోషే అని పేరు పెట్టింది. 

2. మధ్యవర్తి - నిర్గమ 24:3 

3. ఫరోకి దేవుడు - దేవునిచే ఫరోకి దేవుడుగా నియమించబడ్డాడు. నిర్గమ 7:1 

4. నా సేవకుడైన మోషే -  అని దేవుని  చేతే సాక్ష్యం పొందిన వాడు.    సంఖ్యాకాండము 12:6 - దేవుని సంభోధన 

5. మోషే ధర్మశాస్త్రము - ధర్మశాస్త్రముకే ఒక పేరు పెట్టారు - అది మోషే ధర్మశాస్త్రము.

6.  మిక్కిలి సాత్వికుడు -  భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు- దేవుని సాక్ష్యం సంఖ్యాకాండము12:3

7. నాయకుడు.  - ఆరు లక్షలకంటే యెక్కువైన జనాంగమును నడిపించిన నాయకుడు.

8. దేవుని యాజకుడు. -  కీర్తన 99:6

9. దేవుడు ఏర్పరచుకొనిన వ్యక్తికీర్తన 106:23

10. దేవుని తీర్పును ప్రజలకు చెప్పువాడు నిర్గమ 18:15

11. నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. -  అతడు నాయిల్లంతటిలో నమ్మకమైనవాడు.  దేవునిసాక్ష్యం  సంఖ్యా.12:7

ఇన్ని విధాలుగా బైబిల్లొ మోషే పిలువబడ్డాడు అంటే, ముఖ్యంగా దేవాది దేవుడే స్వయంగా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఖచ్చితముగా మోషేలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉండేఉండాలి.  అవేంటో కాస్త పరిశీలనగా చూసి నేర్చుకుందాం.

  • గుర్తించాడు:  మోషే రాజకుటుంబములో పెరుగుతున్నాడు. సకల భోగబాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. కాని తాను యెవరో, తన ప్రజలెవరో ఇక్కడ యెందుకు ఉండవలసి వచ్చిందో గుర్తించాడు.

దేవుడు మొదటిసారి మోషే.... మోషే అని పిలవగానే ఆయన స్వరాన్ని గుర్తించి "చిత్తం ప్రభువా" అన్నాడు.  నిర్గమ. 3:4.  ఆయన మాట్లాడిన తరువాత తన కర్తవ్యాన్ని గుర్తించాడు... సిద్దపడ్డాడు. 

  • నడిపించాడు: ఒకరిని.. ఇద్దరిని కాదు ఆరు లక్షల పైబడిన జనాంగాన్ని.  ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా 40 సంవత్సరాలు. తన స్వరముతో లేక గంభీరమైన వాక్స్చాతుర్యముతో నడిపించాడా? లేదు.. నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడు అయినా నడిచాడు... నడిపించాడు.
  • నిందలు భరించాడు:

దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఎన్ని అద్భుతాలు జరిగించినప్పటికీ,  నడిపిస్తున్న మోషే మీద మరియు బానిసత్వం నుండి విడిపించిన దేవుని మీద ఏదోవిధంగా అసహనంగా మాట్లాడేవారు. ఆలా ఎన్నోమార్లు అవమానించినప్పటికీ దేవా నాకెందుకు ఈ పని అప్పజెప్పావు... వీళ్ళు చేసిన పాపానికి నేనెందుకు 40 సంవత్సరాలు ఈ అరణ్యములో బాధపడాలి అని ఒక్కసారి కూడా దుఃఖపడలేదు. 

ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను. 16:2 

అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి. 17:3 

 మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచుమీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సంఖ్యాకాండము 16:41

  • నమ్మకస్తుడుగా ఉన్నాడు:  యెహోవా సాక్ష్యం

దేవుడు తనకు ప్రత్యక్షమై అప్పగించిన ప్రతి పనిని కచ్చితముగా నెరవేర్చాడంట. ఆ మాట స్వయానా మన ప్రభువే సాక్ష్యామిస్తే ఇంక అందులో doubt ఏముంటుంది. 

అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. సంఖ్యాకాండము 12:7 

యెహోవా మోషేకి అజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ 11:15

దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, హెబ్రీయులకు 10:21

ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. హెబ్రీయులకు 3:2-5

  • అడ్డుపడ్డాడు:

ప్రజలు తన మీద సణిగినప్పటికీ ఓర్చుకుంటూ, దేవునికి కోపం వచ్చి వారిని నాశనం చెయ్యాలి అనుకున్న ప్రతిసారి దేవునిని బ్రతిమాలుకొనేవాడంట. ఆయన సన్నిధిలోనికి వెళ్లి ఆయన కోపము చల్లారే విధముగా ఒక ప్రేమికుడి లాగా ఆయనతో మాట్లాడేవాడంట.

అప్పుడు ఆయన నేను వారిని నశింప జేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే అయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. కీర్తన 106:23

మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? 32:11

దేవుడు పిలిచినప్పుడు ఆయనను గుర్తించి, వెంబడించి, ఆయనకు లోబడి ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చినందుకు ఆయన మోషేకి ఇచ్చిన ఆదిఖ్యత ఏమిటో తెలుసా.....

1. నేను మనస్పూర్తిగా స్పష్టంగా అతనితో మాట్లాడతాను, అతనికి నన్ను చూసే అవకాశాన్ని కూడా ఇస్తాను అని ప్రభువు అన్నారు. నిర్గమకాండము 12:8 నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును.

33:9 మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.

 మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను.  33:11

2. ఆ సీనాయి పర్వతం మీద ప్రభువు సన్నిధిలో ఉండిపోయి ఆయన మాటలు వింటూ ఒక గొప్ప ధర్మశాస్త్రాన్ని ప్రజలకు పరిచయం చేసే భాగ్యం దక్కించుకున్నాడు.

3. ఏసు ప్రభువు వారు భూమి మీదికి మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు... ఏలీయాతో పాటు మోషే కూడా వచ్చి కొంత సేపు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కింది.  "మోషే మరియు ఏలీయా వారికీ కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. మార్కు 9:4"

ప్రభువునందు  ప్రియులారా,

నమ్మకముగా ఉండువానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాటకు అర్ధం ఇదే అని రుజువవుతుంది కదా! ఇదెంత గొప్ప భాగ్యం.  మోషే గారు చాలా విషయాలు నేర్పించారు. అతను ఇశ్రాయేలు జనులకు మాత్రమే కాదు ఇప్పుడు మనకు కూడా మార్గదర్శి గా కనిపిస్తున్నాడు.

మన ప్రయాణం కూడా ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ సమయంలో మోషే దేవుని పర్వతం వైపుగా వెళ్ళినప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినట్లుగానే.... మనం వాక్యం వైపుగా అడుగులు వేసినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. 

మన తండ్రిలో మార్పు లేదు.  ఆయన అప్పుడు ఇప్పుడు అదే మనస్సుతో ఉన్నారు. మోషేకి తోడై ఉన్నట్లు మనకు కూడా తోడై ఉన్నారు. మోషే కర్ర పైకి ఎత్తితే విస్తార జలాలు పక్కకి తొలగి నిలబడ్డాయి. ఎన్నో అద్భుతాలు జరిగిపోయాయి. చేతులు పైకి ఎత్తితే యుద్దాలు ఆగిపోయాయి.  ఈ రోజు మన జీవితంలో ప్రతి రోజు ఒక అద్భుతమే... ప్రభువు గొప్పతనమే... మనము కూడా మోషే లాగా ప్రభువు వైపు విశ్వాసముతో మన హృదయాన్ని పైకెత్తినప్పుడు అవసరమైతే ఏ పరిస్థితి ఎలా ఉన్నా మనకోసం పరిస్థితులు అన్ని మార్చగల సమర్థుడు మన ప్రభువు.  

నిన్న నేడు నిరంతరం ఏకరితిగా ఉన్న సర్వోన్నతునికి కోటనుకోట్ల వందనాలు.

మోషే విశ్వాస యాత్ర గురించి మరికొన్ని సంగతులు ధ్యానం చేస్తూ మరలా కలుస్తాను.

ప్రభువు మనతో ఉండు గాక. ఆమెన్!

11, ఏప్రిల్ 2021, ఆదివారం

11. ఎందుకిలా జరిగింది?

ప్రియమైన స్నేహితులారా,

మన ప్రభువైన క్రీస్తును మరణం నుండి లేపిన తండ్రి యొక్క ఆత్మ మనతో ఉండునుగాక! ఆమెన్!

ఎందుకిలా జరిగిందని నాకెప్పుడూ అనిపించేది. ఈ సందేహంలో  ఒకటి కాదు మూడు ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో మీతో కూడా share చేసుకోవాలని ఆశపడుతున్నాను.

1. యేసు ప్రభువు వారు  భూమి మీదికి ఎందుకు రావాలి?

2. ఎందుకు ఇన్ని భాధలు ఓర్చి చనిపోవాలి?      

3. ఎందుకు అందరిని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవాలి?

  ఈ ప్రశ్నలకు సమాధానాలు కొంతవరకు మనకు తెలుసుగాని లేఖనాలు మరియు చరిత్ర ఆధారాలతో  మరింత స్థిరమైన విశ్వాసంలోకి నడుద్దాం.

చరిత్రలో క్రీస్తు శకం మొదటి 33 1/2 సంవత్సరాలలో జరిగిన ఈ మహా అద్భుతానికి మనకి ఏమిటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటే, చరిత్ర నుండి మరియు లేఖనాల  నుండి కుండ బద్దలుగొట్టినట్టు సమాధానాలు బయటికి వచ్చాయి. వాటన్నిటిని మరొక్కమారు ధ్యానం చేసుకుందాం.

  • దేవుడైన యెహోవా భూమిమీద మనిషిని ఒక మంచి ఉద్దేశ్యముతో తన పోలికలో తయారుచేసుకొని, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిమీద ఉన్న సమస్తమైన వాటిని ఏలమని చెప్పాడు. అయితే అతను దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన మీదకు మరణమును తెచ్చుకున్నాడు. ఆ మరణం అతనికే కాదు, అతని గర్భములో పుట్టిన ప్రతిమనిషిలోనికి  ప్రవేశించింది. పాపం వలన వచ్చు జీతం మరణం అని వాక్యం చెప్పినట్టు ప్రతి మనిషి పాపం చేస్తూ మరణమునకు పాత్రుడవుతున్నాడు.  అలా జరగడం దేవునికి ఇష్టం లేదు. 
  • మన తండ్రి మృతులను సజీవులనుగా చేయువాడును లేనివాటిని ఉన్నట్లుగా పిలువగల సమర్ధుడైనప్పటికీ,  తన అద్భుత శక్తి ద్వారా కాక,  ఒక మనిషి వలన వచ్చిన పాపం మరొక మనిషి ద్వారా మాత్రమే తీసివేయాలని ప్రభువు నిర్ణయించుకున్నాడు. 
ఆదాములాగా ఆజ్ఞను అతిక్రమించి, వద్దని చెప్పిన పండు తినలేదు కదా మరి మనలో మరణమునకు తగిన పాపం ఏముంది?

చాలా ఉన్నాయని వాక్యం చెబుతుంది. ఉదాహరణకు..... దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులు అనువారు మరణమునకు పాత్రులు.

మరణ శిక్ష అంటే యెలా ఉంటుంది?

మరణశిక్షకు తగిన పాపము చేసిన వానిని చంపి మ్రానుమీద వ్రేలాడదీయబడాలని ధర్మశాస్త్రం చెబుతుంది. 

అంతేనా????

ఇంకా ఉంది. అది శారీరక మరణమే కాకుండా తండ్రి మహిమలో జీవించే నిత్యజీవమును కూడా కోల్పోయి నిత్యాగ్ని దండనకు పాత్రులమవుతాము. 

ఈ పాప శిక్షను తప్పించుకొనే మార్గం ఏమైనా ఉందా? 

  • ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం ఒక మేక పిల్లను పాప పరిహారార్ధబలిగా అర్పించాలి. మరియొక మేక పిల్ల మీద చేతులు ఉంచి వారి అతిక్రమములను దోషములను దాని మీద ఒప్పుకొని ఆ మేక తలమీద వాటిని మోపి దానిని అరణ్యములో ఒంటరిగా విడిచి పెట్టాలి.
  • అలాగే ఇశ్రాయేలు వారు చేసిని పాపము నిమిత్తము వారి మీదకు శిక్ష వచ్చినప్పుడు మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి దానిని స్తంభము మీద పెట్టినప్పుడు దానిని నిదానించి చూచినవారు ఆనాడు బ్రతికారు.
  • అయితే ఈ విధంగా ఇశ్రాయేలీయుల కోసం పాపపరిహారం జరిగి ఉంటే మరి అన్యులమైన మన సంగతి ఏమిటి? అని అనుకుంటే... ఇశ్రాయేలీయులకి మనకి అందరికి కలిపి ఒక్కసారే పుణ్యదాన బలియాగము చేయబడాలని తండ్రియైన  దేవుని నిర్ణయమైంది.  అంటే ఒక మనిషి ద్వారా వచ్చిన మరణం ..... పాపం ఎరుగని మరియొక మనిషి ద్వారానే విమోచన జరగడం అన్నమాట.  (1 కొరింధి 15:21)

మరి ఆదాము అను ఒక మనిషి ద్వారా అందరికి విస్తరించిన పాపమును పరిహరించగల సమర్ధుడెవరు?  

రోమా 5:8 ప్రకారం దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరుస్తూ తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువువారిని పాప పరిహార క్రయధనమును చెల్లించడానికి ఈ భూమి మీదకి మానవ శరీరాకారములో పంపించారు. సమస్తమును సృజించిన ఆయన శరీరధారిగా వచ్చి ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనలను విడిపించాలని మన పాపముల నిముత్తము తనను తాను మరణమునకు అప్పగించుకున్నారు.  (గలతి 1:4; యోహాను 1:2, యోహాను 1:14. యోహాను 18:37-38 37)

ఆయనలో పాపం ఏమాత్రమైన ఉన్నదా?

లేదు.  ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చయినవాడు.  కాని ఆయనలో మరణమునకు తగిన హేతువేమైనను లేకపోయినప్పటికీ మనము ఆయన ద్వారా నీతిమంతులముగా తీర్చబడడానికి ఆయనే పాపముగా చేయబడ్డారు. (అపొస్తలుల కార్యములు 13:28; 2 కోరింథీయులకు  5:21)

క్రీస్తు మరణం ద్వారా ఏం జరిగింది?

ఆదాము ద్వారా వచ్చిన పాపము ఏరీతిగా విస్తరించిందో యేసయ్య శిలువ మరణం ద్వారా కృప మనలోనికి విస్తరించింది.

యెన్ని ఉన్నా, ఏమి చేసినా మనిషికి మరణమంటే భయం. ఆ భయానికి బానిసలమైపోయాము. అలాజరుగుతూ ఉంటే మన కన్న తండ్రి ఊరుకుంటారా? ఆవిధంగా భయపెడుతున్న అపవాదిని ఓడించి మరణం ద్వారా నశింపజేయడానికి యేసయ్యను భూమిమీద రక్తమాంసములు గల ఒక మనిషిలా పంపించారు. (రోమా 5:16; హెబ్రీ 2:14.15;)

మనము ఎలా నీతిమంతులముగా తీర్చబడతాము?

ఈ ప్రశ్నకు పౌలు సమాధానం వినండి. "రోమా 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము."
రోమా 5:8-9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
ఆ నీతి మనలోనికి యెప్పుడు వస్తుంది?

మన ప్రాచీన స్వభావమును ఆయనతో పాటు శిలువ వేసి మన గతపాపముల విషయంలో మనము చనిపోయాము  వాటితో మనకిక సంభంధం లేదు అనుకొని,  మనమింక మృతులము అనుకొని యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని హృదయ మందు విశ్వసించినయెడల, మనము రక్షించబడతాము.

ఆయన మరణం ద్వారా మనకు రక్షణ కలిగితే మరి ఆయన పునరుద్ధానం వలన ఏంజరిగింది?

క్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానము మనకు రెండు విషయాలను బయలు పరుస్తుంది.

మొదటిది....

క్రీస్తుతో పాటు మనము కూడా శిలువ వేయబడడము అంటే- పాపముతో కూడిన మన పాత జీవితాన్ని మరణమునకు అప్పగించడమన్నమాట. ఆయనతో పాటు తిరిగి లేపబడడం అంటే మనము నూతన జీవితము  పొందుకొని ఆయన సహవాసంలో జీవమును సమాధానమును కలిగి ఉంటాము.

రెండవది....

క్రీస్తు శరీరరీతిగా మరణించారు.  మరలా అదే శరీరంతో తండ్రి ఆయనను లేపారు.  అందుకే సమాధి కాళీ అయ్యింది.  తరువాత ఆయన మహిమ పరచబడ్డారు.  మనము కూడా మన సమయము వచ్చినప్పుడు అనగా మనలను సృజించిన సృష్టికర్త నరులారా తిరిగిరండని పిలిచినప్పుడు మనము మరణిస్తాము.  కాని యేసయ్య వచ్చినప్పుడు,  ఆయన యెలా పునరుద్దానుడయ్యాడో అలాగే మనము కూడా పునరుద్ధానమవుతాము.  అంటే ప్రభువు వచ్చి మరణాన్ని ఓడించి విజయంతో తిరిగి లేవడం వలన మరణం ఓడిపోయింది. అందువలన ఇప్పుడు మనం మరణం గురించి భయపడనక్కరలేదు. చనిపోయినా అక్షయులుగా తిరిగి లేపబడతాము.  అప్పుడు మార్పుపొంది మహిమ శరీరాన్ని ధరించుకుంటాము. (1 కొరింధి. 15:21-23)  

ఒకవేళ ఈ బలియాగము జరిగి ఉండకపోయి ఉంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న ఈ విడుదల క్షమాపణ మరియు సమాధానము మనకు కలిగేవా??

మరొక ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే..... ప్రభువు మాటకు లోబడి ఆయనయందు విశ్వాసము ఉంచేవారికి తీర్పు ఉండదంట.  మనమింక మరణములో నుండి జీవములోనికి దాటిపోయినట్లేనంట. అదేవిధంగా మరణము వరకు నమ్మకముగా ఉండే వారికే ఆజీవకిరీటమని జ్ఞాపకముంచుకోవాలి.  అలాగే మనము జీవించేది ఇక మీదట మనకోసం కాదు గాని మనకోసం మృతిపొంది తిరిగి లేచిన మన ప్రభువు కోసం మాత్రమే జీవించాలి. (2 కొరింధి 5:15)

కాబట్టి యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని భాధలు పడి సిలువ మరణం పొందునంతగా తనను తాను ఎందుకు అప్పగించుకున్నారో నాకు బాగా అర్ధమయ్యింది.  అయితే ఇంతగా మనలను ప్రేమించే ఆ ప్రభువు అందరిని వదిలేసి యెందుకు మరలా పరలోకం వెళ్ళి పోయారు అనే నా ప్రశ్నకు ఆయన నుండి మృదువైన సమాధానం వచ్చింది. 

  • నేను మరణిస్తేనే మీ పాపములకు విడుదల వస్తుంది గనుక.....  నేను మరణించాను.
  • నేను సమాధి నుండి తిరిగి లేస్తే మరణం ఓడిపోయి... మీలో మరణ భయం తొలగిపోవడానికి నేను తిరిగి లేచాను.
  • ఇక్కడ తండ్రి నాకు అప్పగించిన పని అయిపోయింది గనుక నేను ఆయన దగ్గరకి తిరిగి వెళ్ళి అక్కడ స్థలం   సిద్దపరచి మిమ్మలను నాదగ్గరకు తీసుకు వెళ్ళడానికి మరలా తిరిగి వచ్చేవరకు తండ్రి నానామమున పరిశుద్ధాత్మను మీదగ్గరకు పంపి ప్రతిక్షణం మీకు తోడుగా ఉంటారు.   (యోహాను 14:26-18).

ఇలా యెవరైనా మనలను ప్రేమిస్తారా? ప్రాణమిస్తారా? తనతో పాటు యుగయుగాలు ఉంచుకోవడనికి ఇష్టపడతారా?

ఆ ప్రేమకు మనమేమివ్వగలం??? తన ప్రాణమిచ్చిన ప్రేమమూర్తికి విలువైన కానుక ఇవ్వాలనిపిస్తుంది కదా! ఆయనకి ఇవ్వగలిగిన కానుక మన దగ్గర లేదు గాని ఆయనకి ఇష్టమైన కానుక మన దగ్గరే ఉంది... అదే నా హృదయం... నీ హృదయం.  ఇచ్చేద్దాం పూర్తిగా....  చివరి శ్వాస విడిచే దాకా......

ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది.  ఆయన ప్రేమను మరొక్కసారి తలంచుకొని నా హృదయం  ఉప్పొంగి పోతుంది. ఆ ప్రేమికుని గురించి మాట్లాడుతూ ఉంటే యెన్ని గంటలు గడుస్తున్నాయో తెలియదు. ఆ ప్రేమకు పాదాభివందనం. మరలా మరో ప్రేమ సందేశంతో కలుస్తాను.

శిలువను గురించి పరిశోధకులు కనుగొన్న కొన్ని ఆధారాలు మీముందు ఉంచుతున్నాను. గమనించండి. 

అదే విధంగా పైన చెప్పబడిన విషయం యొక్క references అన్నీ దిగువున ఇస్తున్నాను మీరు కూడా మరలా ధ్యానించి ఆ ప్రేమలో revive అవ్వండి.

అపొకా. 2:32  ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్ష్యులము.

చారిత్రక ఆధారాలు:

  • యేసు శిలువ మరణం మరియు పునరుద్దానము తరువాత క్రైస్తవ మతాన్ని వ్యాపించకుండా ఆపడానికి ఆసమయంలో ఉన్న ఆధారాలన్నిటిని అనగా శిలువకు సంభందించిన వస్తువులన్నిటిని కనుమరుగు చేయడానికి ప్రయత్నము
    చేసారని చరిత్ర కారులు చెబుతున్నారు.  వారి పరిశోధనల ప్రకారం, రోమన్లు గొల్గొతా దగ్గర యేసయ్య శిలువను మరియు ఇద్దరు దొంగల శిలువలను ఒక పెద్దగోతిలో పడవేశారంట.  300 సంవత్సరాల తరువాత Empress అనే పరిశోధకుడు ఆ పవిత్ర భూమిని దర్శించినప్పుడు అక్కడ 3 శిలువలను కనుగొన్నాడంట.  కాని దానిలో ప్రభువు శిలువ యేదో యెలా తెలుస్తుంది?

అప్పుడు యెరుషలేములో ఉన్న బిషప్ గారికి ఒక ఆలొచన వచ్చిందంట.  అప్పటి వరకు కుదరని రోగంతో భాధపడుతున్న ఒక వ్యాధిగ్రస్తురాలని తీసుకొని వచ్చి ఆ మూడు శిలువలను తాకి చూడమన్నప్పుడు దేనిని తాకినప్పుడు ఆమెకు స్వస్థత కలిగిందో అదే ప్రభువుని వ్రేలాడదీసిన శిలువ అని గుర్తించారు.  వెంటనే St. Helena అక్కడ ఒక చర్చిని నిర్మించాలని ఆదేశించారంట.  ఆవిధంగా 614 వరకు ఆ శిలువను బద్రపరచ గలిగారంట.

  • తరువాత, సిలువ పర్షియన్ల చేతుల్లోకి చేరి మరొక్కసారి కనుమరుగైంది. 630 లో, బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి అయిన హెరాక్లియస్ పర్షియన్లపై అద్భుతమైన విజయాన్ని సాధించాడు, అప్పుడు విజయవంతంగా సిలువలో కొంత భాగాన్ని జెరూసలెంకు తిరిగి ఇచ్చాడు - మరొక భాగం కాన్స్టాంటినోపుల్‌లో మిగిలిపోయింది - అక్కడ అతను ఆ సిలువ  బాగాన్ని కల్వరి కొండ వద్ద ఉంచాడు. 
  • అయితే, కొన్ని సంవత్సరాల తరువాత అరబ్ ఆక్రమణ ప్రారంభమయ్యి జెరూసలేం ముస్లిం పాలనలోకి వచ్చింది. 10 వ శతాబ్దం వరకు, నిజమైన శిలువ యొక్క ఆరాధకులు సిలువను  జాగ్రత్తగా ఉంచగలిగారు. క్రైస్తవులు హింసించబడినప్పుడు, సిలువ దాని అమరిక నుండి తీసివేయబడి మరోసారి దాచబడింది. తొంభై సంవత్సరాల తరువాత (1099 లో) ఇది మరలా  కనిపించింది. 
  • ఏది ఏమయినప్పటికీ, ఇది ప్రస్తుతానికి, 1187 లో వలె, ట్రూ క్రాస్ మరోసారి అదృశ్యమైంది, మరియు ఈసారి ఖచ్చితంగా, గెలీలీలోని టిబెరియస్ సరస్సు పక్కన ఉన్న హట్టిన్ యుద్ధభూమిలో సుల్తాన్ సలాదిన్పై విజయం సాధించడానికి క్రూసేడర్లు తమతో తీసుకువెళ్లారు. అయినప్పటికీ, వారు యుద్ధంలో ఓడిపోయారు, అప్పుడు ఆ సిలువ జెరూసలేం సుల్తాన్ చేతిలో పడింది. అప్పుడు చిన్న ఆధారం కూడా  వదలకుండా క్రాస్ అదృశ్యమైంది. ఈ వార్త విన్న పోప్ అర్బన్ III తట్టుకోలేక చనిపోయాడని చరిత్ర కథనం.
  • సెయింట్ లూయిస్, 1238 లో, క్రాస్ యొక్క రెండు ముక్కలను కొన్నాడు, తరువాత 1242 లో ఇతర అవశేషాలలో, అతను కొన్ని వస్తువులను అనగా (ముళ్ళ కిరీటం, బళ్ళము, హోలీ స్పాంజ్…), లను అతను  భద్రపరిచాడు - కానీ ఫ్రెంచ్ విప్లవం (1794) సమయంలో, క్రాస్ యొక్క శకలాలు అదృశ్యమయ్యాయి. కొన్ని శకలాలు మరియు హోలీ నెయిల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి నోట్రే-డేమ్ కేథడ్రల్ యొక్క సాక్రిస్టీ యొక్క ఖజానాలో ఇప్పుడు భద్రపరచబడ్డాయి.
  • శతాబ్దాలుగా (ముఖ్యంగా మధ్య యుగం నుండి) ప్రపంచవ్యాప్తంగా అవశేషాలుగా పంపిణీ చేయబడిన లేదా విక్రయించబడిన అన్ని చెక్క ముక్కలు అనేక చర్చిలలో విలువైనవిగా భద్రపరచబడ్డాయి. వివిధ విశ్లేషణలు మరియు విచారణల ప్రకారం, యేసు శిలువ యొక్క “నిజమైన” శకలాలు సిలువలో పదవ వంతు మాత్రమే ఉన్నాయి; మిగిలినవన్నీ ప్రశ్నార్థకముగా ఉండిపోయాయి. అవశేషాలను లిగ్నమ్ క్రూసిస్ (“వుడ్ ఆఫ్ ది క్రాస్”) గా సూచిస్తారు. అథోస్ పర్వతం యొక్క ఆశ్రమంలో గ్రీస్‌లో అతిపెద్ద భాగం భద్రపరచబడింది; ఇతర శకలాలు రోమ్, బ్రస్సెల్స్, వెనిస్, ఘెంట్ మరియు పారిస్‌లో ఉన్నాయి.

https://aleteia.org/2018/03/07/what-happened-to-the-true-cross-of-christ/

References:

1. రోమా 1:30-32 "అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు."

2. 1 కొరింధి 15:21మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

3. గలతి.1:4 - మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

4. యోహాను 1:2 -  ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
5. యోహాను 1:14  - ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
6. యోహాను 18:37-38,37- అందుకు పిలాతు-నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు-నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.
7. అపొస్తలుల కార్యములు 13:28 -  ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి.  
8. 2 కోరింథీయులకు  5:21  ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

9. రోమా 5:16 - ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

10. హెబ్రీ 2:14 -  కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
11. హెబ్రీ 2:15 - జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
12. రోమా 8:9 -  దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

13. రోమా 8:10 -  క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.

14. రోమా 8:11 - మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.

15. రోమా 10:9 -  అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

16. రోమా 10:10 - ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
17. రోమా 10:12 - ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

18. రోమా 10:13 -  ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.

19. రోమా 6:3 -  క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

20. రోమా 6:4 -  కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.

21. రోమా 6:5 -  మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

22. యోహాను 16:5-8 - నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూ ర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.

23. యోహాను 5:24 - నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

17, మార్చి 2021, బుధవారం

10. నాయకుడు.. Part-1 (చరిత్రలోని మోషే)


 ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా,

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను.

సర్వశక్తి గల తండ్రియైన దేవుడు చేసిన సృష్టిని గురించి యెన్నో విషయాలు మనం ధ్యానం చేసాము కదా అవన్నీ మరలా జ్ఞాపకం  చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఒక క్రొత్త topic గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ సృష్టి అంతటినీ చేసిన సృష్టి కర్తకు ఒక సాధారణ మనిషి లోబడితే.... ఆయనతో ముఖాముఖీగా మాట్లాడితే ఆ అనుభవం....  ఆ జీవితం ఎలావుంటుందో ధ్యానించాలి అనిపించింది.

వెంటనే జమ్ముపెట్టెలో దొరికిన చిన్నబాబు జ్ఞాపకం వచ్చాడు. నిజమే అతను మోషేనే.  అతని గురించి లేఖనాలలో వెదికితే నిర్గమకాండము మొదలుకొని ప్రకటన గ్రంధం వరకు ఏదో ఒక సందర్భంలో  మోషే ప్రస్తావన (అంటే 31 పుస్తకాలలో 786 వచనాలలో) వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మార్గదర్శి మరియు లక్షలమంది ప్రజలను నడిపించిన ఆ గొప్ప నాయకుడు అయిన మోషే గురించి ధ్యానించవలిసిందే.

అయితే మోషే గురించి బైబిల్లో ఉంది కాబట్టి మనం ఇది నిజమని నమ్ముతాము. కానీ ఇది కల్పనాకధ అయ్యుండవచ్చు కదా! అని doubt పడేవాళ్ళకు చరిత్రను కూడా ముందుగా అధ్యయనం చేసి ఖచ్చితమైన అధారలతో నిరూపిద్దాం.

1. నాయకుడు... (చరిత్రలోని మోషే) Part -1

2. నాయకుడు.. (లేఖనాలలో మోషే)  Part-2

3. నాయకుడు.. (గమ్యం చేరని యాత్రికుడు) Part-3

చరిత్రలోని మోషే గురించి Part-1 ధ్యానం  చేద్దాం.

మోషే యొక్క చరిత్ర గురించి చాలా విభేదాలు వచ్చినప్పటికీ బైబిల్లో అతని గురించి వ్రాయబడిన ప్రతి సంఘటన ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించబడిన తరువాత బైబిలు పండితులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిఫ్టు నుండి ఇశ్రాయేలీయులయొక్క నిర్గమము ఖచ్చితముగా సంభవించిందని, అది కూడా మోషే అధ్వర్యంలోనే జరిగిందని అంగీకరిస్తున్నారు.

చరిత్ర ప్రకారం మోషే జీవించిన కాలం 1400 BC - 1201 BC.

 మోషే MOUZIZ  అని, "మోషే రబ్బూని" అని, అనబడుతూ ప్రపంచ చరిత్రలో అతి ముఖ్యమైన మత నాయకులలో ఒకరిగా పరిగణించ బడ్డాడు.

ఎవరు...ఏమనుకుంటున్నారు?

జుడాయిజం, క్రైస్తవ మతము, ఇస్లాం మరియు బహాయి మతాలు మోషే దేవుని ముఖ్యమైన ప్రవక్త మరియు ఏక ధర్మ విశ్వాసం యొక్క స్థాపకుడు అని పేర్కొన్నారు.  బైబిలు యొక్క మొదటి ఐదు పుస్తకాలైన తోరాను "దేవుని నుండి" పొందుకొని ప్రజలకు అందించడం వలన మోషే ఇశ్రాయేలీయుల నాయకుడు మరియు చట్టసభ సభ్యుడు అని పిలువబడ్డాడు.

బైబిలు:  మోషే కధ నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము అనే పుస్తకాలలో చెప్పబడింది. అతను బైబిలు అంతటా ప్రస్తావించబడ్డాడు. ప్రత్యేకించి క్రొత్తనిబంధనలో చాలా తరుచుగా ఉదహరించబడిన ప్రవక్త.

ఇస్లాం మతము: ఖురాన్లో కూడా మోషే ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. బైబిల్లో మాదిరిగానే ఖురాన్లో కూడా  మోషే దైవిక ఉద్దేశ్యాలను మానవులకు అందించడానికి మధ్యవర్తిగా నిలువబడిన వ్యక్తిగా వారు బావిస్తారు.

ఈజిప్టు చరిత్రకారుడు Manetho:  (3 వ శతాబ్దం BC) ఇతను Osarsiph  అనే ఒక ఈజిప్టు కధ చెప్పాడు. ఆ గురువు ఈజిప్టు రాజుపై తిరుగుబాటు చేసి కొంతమంది ప్రజలను మరొక ప్రాంతానికి నడిపించాడు. అలాగే అక్కడున్న ఈజిప్ట్ మతం యొక్క బహుదేవతారాధనను    తిరస్కరించి   దేవుడు ఒక్కడే అని ఏకాధర్మ విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటాడు. అలాగే మనుష్యులెవరూ ఉచ్చరించలేని పేరు కలిగిన దేవుణ్ణి అతను నమ్మాడు అని ఆ చరిత్రకారుడు చెప్పాడు. అతను ఖచ్చితంగా మన మోషే గారే కదా!

  • ఈజిప్ట్ యొక్క రాజవంసాన్ని పాలించిన 19వ రామసైడ్ కాలంలో, 13వ శతాబ్దం నాటి నిర్గమకాండమునకు మద్దతు నిచ్చే సాక్ష్యాలు చాలా వెలుగు చూసాయి.
  • ఈజిప్ట్ గ్రంధాలు, కళాఖండాలు మరియు పురావస్తు ప్రదేశాలను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 13 వ శాతబ్దం నుండి బైబిల్లో చెప్పబడిన ప్రతివిషయం ఖచ్చితమైనదని నిరూపించబడుతుంది.
  • ఉదాహరణకు ఈజిప్ట్ నుండి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో కనిపించే 3 ప్రదేశాల పేర్లు రామేసైడ్ కాలం (BC 13 -11BC శతబ్దాల) నుండి బైబిల్ పేర్లు పితోమ్, రామసేన్, ఎంసుఫ్ (ఎర్ర సముద్రం లేదా రెడ్ సీ) ఈజిప్ట్ స్థల పేర్లు ఈజిప్ట్ గ్రంధాలలో  కనిపిస్తాయి.

సీనాయి కొండమీద మోషేకి ఇవ్వబడిన పది ఆజ్ఞల రాతిపలకలు:

మోషే చరిత్రను రుజువు చేసే మరొక విలువైన ఆధారం 10 ఆజ్ఞల రాతిపలకలు... ఇంకా ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి?  అసలు ఏమి జరిగింది?

1. మోషే సీనాయి పర్వతం మీద నుండి తెచ్చిన మొదటి రాతి పలకలను బంగారు దూడను చూసినప్పుడు అతను కిందకి విసిరేసాడు. అతను దేవుని ఆజ్ఞ ప్రకారం    సీనాయి  పైకి తిరిగి వెళ్ళాడు. అప్పుడు అతనికి  రెండవ set ఇవ్వబడింది.

2. రెండవ set రాతి పలకలు, వాటిపై చెక్కబడిన పది ఆజ్ఞలతో  నిబంధన మందసంలో దాచబడ్డాయి.(ద్వితీయ. 10:1,2 హెబ్రీ 8:4-5) (1 సమూయేలు 3:3 మరియు 1రాజులు 8:11).

అయితే క్రీస్తుపూర్వం 587 లో యెరూషలేములోని మొదట, ఆలయంను స్వాధీనం చేసుకున్నప్పుడు, యిర్మియా ప్రవక్త మరియు కొంతమంది మనుష్యులు కలిసి మందసమును ఎడారిలోకి తీసుకువెళ్ళి పాతిపెట్టాడని మరియు దానిలోని విషయాలు ఈ రోజు వరకు దాగి ఉన్నాయని ఈ వచనాల ఆధారంగా తెలుస్తుంది (2 మక్కబీస్ 2:4)  (2 మాక్. 2: 5).

3. ఆ రాతిపలకలు భద్రం చేయబడిన ప్రదేశాన్ని క్రీ.శ 400 మరియు 600 మధ్య రోమన్లు చేత నాశనం చేయబడిన తరువాత కొన్ని శతాబ్దాలుగా శిలశిధిలాలలో ఈ రాయి కూరుకుపోయిందని పురాతన నాణేల డైరెక్టర్ డేవిడ్ మైఖేల్స్ చెప్పారు.

ఇది బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలను దేవుడు తన వేలితో రాసినటువంటి చెక్కుచెదరకుండా ఉన్న రాతి కాపీ.

4. ఇశ్రాయేలీయుల  యొక్క "జాతీయ నిధి" గా వర్ణించబడిన ఈ రాయిని మొదటిసారిగా 1913 లో ఇజ్రాయెల్‌లోని యవ్నెహ్ సమీపంలో ఒక రైల్రోడ్ స్టేషన్ కోసం త్రవ్వకాలలో వెలికి తీశారు. "దానిని కనుగొన్న కార్మికులు దాని ప్రాముఖ్యతను గుర్తించక పోవడం వలన స్థానిక అరబ్ వ్యక్తికి విక్రయించారు. అతను తన లోపలి ప్రాంగణానికి దారితీసే గది యొక్క


ప్రవేశద్వారం దగ్గర రాయిని అమర్చాడు, శాసనం ఎదురుగా ఉంది" అని మైఖేల్స్ చెప్పారు.

  • ముప్పై సంవత్సరాల తరువాత, 1943 లో, ఆ వ్యక్తి కొడుకు మునిసిపల్ పురావస్తు శాస్త్రవేత్త వై.కప్లాన్కు రాయిని అమ్మేసాడు.
  • "అతను వెంటనే అది అరుదైనదని మరియు చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించాడు, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి హెరిటేజ్ పురాతన నాణేల డైరెక్టర్ మైఖేల్స్ కు అప్పగించాడు.
  • "ఆ రాతి పలకలమీద ఉన్న అక్షరాల యొక్క సూపర్ ఫైన్ విట్రిఫికేషన్ అధ్యయనం చేయడానికి వారిని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్లారు. శాసనం యొక్క మధ్యభాగం యొక్క కొన్ని అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి - కాని సరైన లైటింగ్ కింద ఇప్పటికీ చదవగలిగే విధంగానే ఉన్నాయి."

5."రాతిపలక  యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలోని మూడు గొప్ప మతాలకు(జుడాయిజం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం) ఆధారం అయిన ఆజ్ఞల యొక్క లోతైన మూలాలు మరియు శాశ్వత శక్తికి నిదర్శనం" అని హెరిటేజ్ పురాతన నాణేల డైరెక్టర్ డేవిడ్ మైఖేల్స్ అన్నారు. అక్కడ పురావస్తుశాఖవారు బైబిల్లో చెప్పబడిన సీనాయి సంఘటనను రుజువు చేస్తున్నట్లుగా, రాతికి రెండు వైపులా రాసిన లేఖలను దేవుని వేలుతో రాయిలో కాల్చారు మరియు లేజర్ కూడా అలా చేయలేదని వారు అంగీకరించారంట.

6. రెండు అడుగుల చదరపు (0.18 చదరపు మీటర్), 115-పౌండ్ల (52 కిలోల) పాలరాయి స్లాబ్‌న సమారిటన్ అని పిలిచే ప్రారంభ హీబ్రూ లిపిలో చెక్కబడి ఉంది. ఆ రాతిపలకను చాలాకాలం వరకు పురాతన పట్టణమైన పాలస్తీనాలోని జబ్నీల్ పట్టణంలో సమారిటన్ ప్రార్థనా మందిరంలో ఉంచారు. ఇప్పుడు అది ఆధునిక ఇజ్రాయెల్‌లో యావ్నెహ్ అని మైఖేల్స్ అర్ధం చేసుకున్నాడు.

ఆరాతి పలకల ప్రాముఖ్యతను గుర్తించిన తరువాత, కప్లాన్ అనే ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, అప్పటి ఇజ్రాయెల్ యొక్క రెండవ అధ్యక్షుడైన యిట్జాక్ బెన్-జ్వినిని, దాని రుజువును పరిశోధించడంలో సహాయపడమని కోరాడు. ఆ తరువాత వారు రాతి పలక యొక్క ఆవిష్కరణ కథను వివరిస్తూ దాని చారిత్రక సందర్భం గురించి ముఖ్య సమాచారాన్ని ఒక అకాడెమిక్ పేపర్‌లో ప్రచురించారు.

7. కప్లాన్ చివరికి ఈ రాయిని రబ్బీ సాల్ డ్యూచ్ అనే అమెరికన్కు విక్రయించాడు, అతను దానిని యుఎస్ కి తీసుకెళ్ళి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లోని తన లివింగ్ తోరా మ్యూజియంలో ప్రదర్శించాడు .

ఇజ్రాయెల్ "నేషనల్ ట్రెజర్" గా వర్ణించబడిన ఆజ్ఞలు గల రాతి పలకలను తీసుకువెళ్లడాన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (IAA) 2005 లో జారీ చేసిన ప్రత్యేక అనుమతి కింద ఆమోదించింది. 10 ఆజ్ఞలు రాయబడిన మొట్టమొదటి రాతి వెర్షన్ $ 850,000 కు అమ్ముడైంది.

  •  దాదాపు చాలామంది చరిత్రకారులు మోషే చరిత్ర లేదని చెప్పారు. మరి బైబిల్లో ఉన్న మోషే చరిత్ర లేకుండా, చారిత్రక 10 ఆజ్ఞల రాతి పలకలు ఉండవు కదా. ఒక్కమాటలో చెప్పాలంటే, రాతి పలకలు బైబిల్లో మోషే  కథను ధృవీకరిస్తున్నాయి.
  • ఈ ఆవిష్కరణ బైబిల్ వచనం యొక్క చారిత్రక విశ్వసనీయతకు గొప్ప నిర్ధారణ. ఒకప్పుడు చాలా మంది ఇరాక్‌లో నివసించారని కూడా ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నేడు, ఈ వ్యక్తులలో కొంతమంది జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి: యూదులు, క్రైస్తవులు, మాండెయన్లు (జాన్ బాప్టిస్ట్ యొక్క చివరి అనుచరులు) మరియు యాజిడిస్, పురాతన ప్రజలు, వారి నమ్మకాలు జొరాస్ట్రియనిజం, పర్షియా యొక్క ఇస్లామిక్ పూర్వ మతం, ప్రారంభ క్రైస్తవ మతం మరియు జుడాయిజం. ఈ జాతిలో ప్రాణాలతో బయటపడిన వారందరూ ఇప్పుడు ఊచకోతలు, సిలువలు, అత్యాచారం మరియు శిరచ్ఛేదం ఎదుర్కొంటున్నారు.
  • పురావస్తు పరిశోధనలు.. బైబిల్లో చెప్పబడిన విషయాలు చారిత్రాత్మకంగా ఖచ్చితమైనవని ధృవీకరించాయి.

ఇంత సాక్ష్యం మనకళ్ల ముందు కనిపిస్తూ ఉంటే మోషే గురించి అతనికి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మనకు ఉందా?

సీనాయి పర్వతం:

దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిచి 40 రాత్రింబగళ్ళు అతనితో మాట్లాడినట్లు బైబిలు చెబుతుంది.

నిర్గమ కాండము 19:18 లో యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను."

మరి దాని ఆధారం మనకు ఇప్పుడేమైన కనిపిస్తుందా? 

స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సీనాయి పర్వతాన్ని

చూడండి. దానిమీద పరిశోధనలు జరిగిన తరువాత అగ్ని చేత కాల్చబడినట్లు స్పష్టంగా తెలియబడింది.

చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ప్రకృతి గాని, కాలం గాని మరుగు చేయలేని సజీవుడు మన ప్రభువు.  ఆయన చేసిన ఏకార్యము మరుగున పడడానికి వీలులేదు... ఎట్టి పరిస్థితిలోనూ పడదు... పడలేదు.

బైబిల్లో ఉన్న సంఘటనలన్నీ చారిత్రక రుజువులతో మీముందు ఉంచాలని ఈ blog start చేశాను. ఇప్పటి వరకు 10 articles రాసాను. నోవహు ఓడతో ప్రారంభించి మోషే వరకు వచ్చాము.  ఒక్కొక్క topic తీసుకొని బైబిల్ లోను మరియు చరిత్రను study చేస్తూ ఉంటే ఆనందంతో ఆశ్చర్యం కలిగించే ఆధారాలు ఎన్నో తెలుస్తున్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం.

వీటిని చదువుతూ నేను విశ్వాసంలో బలపడుతూ మీరు కూడా బలపడాలని ఆశపడుతున్నాను.

చరిత్ర సాక్ష్యం కంటే విలువైన సాక్ష్యం ఇక్కడ ఉంది. అది మనమే. ఈ ఆధారాలు ఏమి చూపించకపోయినా మన తండ్రి ప్రేమకు మనము ఎప్పుడో బందీలైపోయాము.   ఆయన ప్రేమకు నిండు వందనం.

చరిత్రలో మోషే గురించి ఏవిధంగా ఉందో తెలుసుకున్నాము కదా ఇంక లేఖనాలలో మోషే గురించి ధ్యానం చేస్తూ మళ్ళీ కలుస్తాను.

May God be with you.

సేకరణ: 

1. ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ యొక్క నిర్గమము యొక్క సాక్ష్యాల గురించి మరింత తెలుసుకోవడానికి , బైబిల్ ఆర్కియాలజీ రివ్యూ యొక్క మే / జూన్ 2016 సంచికలో “ఎక్సోడస్ ఎవిడెన్స్: ఒక ఈజిప్టు శాస్త్రవేత్త బైబిల్ చరిత్రను చూసాడు” అనే పూర్తి కథనాన్ని చదవండి .

2.మరింత సమాచారం కోసం దీనిని చూడండి: http://www.haaretz.com/life/archaeology/.premium-1.639822

 

2, జనవరి 2021, శనివారం

9. నేను, నేను కాను

ప్రియమైన స్నేహితులారా,

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం"నేను, నేను కాను" అనే అంశంతో మీముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. 

ఈ సందర్భంలో నేను ఒక విత్తనాన్ని తీసుకొని  ఇంత చిన్న విత్తనం మహావృక్షంలా యెలా మారిపోయింది? అనే ఆలోచనలో పడ్డాను.  అది దేవుని కార్యమని తెలుసు కాని ఆవిత్తనంలో జరిగిన మార్పు ఏమై ఉంటుంది? automatic గా అంతా జరిగిపోయిందా?  

లేదే! జాగ్రత్తగా చూస్తే అది పగిలింది. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయింది. ఒకవేళ విత్తనం నేను నేనుగానే వుంటాను అని అనుకుంటే మనకు చెట్టేది.. ఫలమేది?  విత్తనం భూమిలోకి వెళ్ళాలి అది పగలాలి అంటే చావాలి అప్పుడు అది మొలకగా మారుతుంది. అది మొక్కై చెట్టై ఫలాలనిస్తుంది.  ఇది మనకు తెలియని విషయం కాదు గాని ఈ సందర్భాన్ని మన జీవితానికి అన్వయిస్తూ యేసయ్య యెన్నోసార్లు యెందుకు చెప్పారో ఇప్పుడు బాగా అర్ధమవుతుంది. "యోహాను 12:24 గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును."

 "1 కోరింథీయులకు 15:36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా."

  • మనం మారాలి. యెప్పటిలాగే ఉంటే ఏం ఉపయోగం. పర్వాలేదులే అని అనుకుంటే మనవల్ల పెద్ద ప్రయోజనం ఏముంది నాటని విత్తనంలాగ.

  • ఎన్నో సంవత్సరాలు మనల్ని దాటి వెళ్లి పోతున్నాయి. కాని మన ప్రయాణం యెప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు అలాగే ప్రభువు రాకడ యెప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. మరి అలాంటప్పుడు మనం ఎప్పటిలాగానే ఉండిపోకుండా ప్రభువు మనకు అవకాశం ఇచ్చినకొలది ఆయన అడుగు జాడలలోనికి మహోన్నతుడైన సర్వశక్తుని నీడలోనికి చేరిపోయి మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో అవసరం కదా! 

  • విత్తనంగా ఉన్నప్పుడు దానికేమి అవసరం లేదు. కాని అది తన రూపం మార్చుకున్నప్పుడు మాత్రం సంరక్షణ కావాలి. నీరు, యెండ మరియు సరియైన నేల.  మనం కూడా పూర్వపు స్థితిలోనే ఉంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకున్నప్పుడు ఏది చేసిన తప్పు అనిపించదు. అలాగే సంతోషం కూడా ఉండదు. ఫలం ఉండదు. ఇంకా చెప్పాలంటే దాని వల్ల ఉపయోగం కూడా ఏమాత్రం ఉండదు.  
  • అలాగే మనం కూడా మన రూపం మార్చుకుని క్రీస్తు రూపులోనికి మారినప్పుడు ఈ నిరాశ జీవితం ఉండదు. నిరీక్షణలో ఉండే ఆనందం అర్ధమవుతుంది. ఆయన సహవాసంలో ఆయన కనుసన్నలలో మనం ఉంటే నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు లాగా ఫలించే ద్రాక్షావల్లిలాగా ఊరెడి నీటి బుగ్గగాను ఉంటామట. మొక్కకు మాదిరిగానే మనకు కావలసిన సంరక్షణ... ప్రభువుతో మాట్లాడటం ముఖ్యంగా ఆయన మాటవినటం అంటే ప్రార్ధన మరియు వాక్య ధ్యానం.

  • నిజమే కదా ఆయన సహవాసంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఈ లోకంలో యెన్ని ఉన్నా లేకపోయినా ఆయన మాట్లాడితే చాలు అనిపిస్తుంది కదా! ఎందుకంటే కష్టంలో కన్నీటిలో ఒంటరితనంలో ఆదుకునేది ఆదరించేది తనకౌగిటిలో హత్తుకునేది ఆయన మాత్రమే. ఈజీవితం మీద అలాగే అది ముగిసిన తరువాత కూడా భరోసా ఇచ్చేది ఆయన మాత్రమే.
చిన్న విత్తనం భూమిలో పడి పగిలితే చనిపోతే ఇంతమార్పు జరిగితే.. మనలో అహంభావం చనిపోతే... నిర్లక్ష్యం చనిపోతే.. నేను నేను కాను ... క్రీస్తువాడనైపోయాను.. క్రీస్తుదాననైపోయాను అనుకుంటే ఎంతమార్పు జరుగుతుందో ఆ ఆనందంలో ఉన్న మనందరికి తెలుసు. 
  • దేవుడు మనకి మరో సంవత్సరం అనే అవకాశాన్ని ఇచ్చారు. బహుశ కొంతమందికి ఇది చివరి అవకాశం కావచ్చు. కళ్ళుమూసుకుని పరిపూర్ణ విశ్వాసంతో ఆయన అడుగుజాడలలో నడిచి వెళ్ళిపోదాం. "యోహాను 12:26. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును"
  • నేను గతజీవితంలోలాగా ఉండను అనుకున్న రోజున దాని పేరు ఇక విత్తనం అనబడనట్లుగానే మనలో మార్పు ప్రారంభమయి ప్రభువు సారూప్యంలోనికి కొంచెం కొంచెంగా మారిపోతాం... అలాగే మారిపోదాం. "1 కొరింధి15:38. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు."
  • అలాప్రభువు రూపులోనికి ఆయన అడుగుజాడలలో ఆయన బిడ్డగా మారిపోయిన రోజున ఆయన లక్షణాలతో ఎదుగుతాం. ఫలిస్తాం. మనలాంటి ఆనేకమందికి ఫలభరితంగా మారిపోతాం. "2 కొరింధి 9:10 విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును."
  • ఇప్పటికే మనలో అనేకమంది ఆయన అడుగుజాడలలో నడుస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇకమీదట జీవించేది గతంలోఉన్న నేనుకాను... నేను నాలా ఆలోచించను.. నాలా మాట్లాడను.. నాలా ప్రేమించను.. నాలా బద్దకించను.. నాలా భయపడను... నాలా ఆగిపోను... నాలా వెళ్ళిపోను... నాలా అసలు ఉండనే ఉండను.  ప్రభువా నీలా నీ బిడ్డలా నీకొరకే... నన్ను మార్చు... అచ్చం నీలా... అని ఒకమంచి నిర్ణయం తీసుకుంటే ఇది ఖచ్చితంగా మనకు Happy New Year.
"రోమా 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి."

"2 తిమోతి 4:8 ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును."


జీవించునది నేను కానని నాయందు క్రీస్తే జీవించునని బ్రతుకుట క్రీస్తే చావయితే లాభమని పౌలు పలికినట్లు పలికే సమయమిదే.  

"గలతియులకు 2:20 నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను   నేను కాను,  క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను."

తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పౌలు అంటున్నాడు.


మనమందరము ప్రభువులో ఇప్పటికే రూపాంతరము చెందాము కాబట్టే మనము వాక్య అధ్యయనానికి ఆశక్తి కనబరుస్తున్నాము. ప్రభువు మాటలతో చారిత్రక రుజువులతో అనేకులను విశ్వాసంలోబలపరుద్ధాం. 
క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక!

I Wish You All a BLESSED NEW YEAR.  May God Be with YOU.




Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com

ఈ పాట ప్రభువుకు మనలను దగ్గరగా చేస్తుంది.  
https://www.youtube.com/watch?v=XvO_Isz2mvA

24, డిసెంబర్ 2020, గురువారం

8. ప్రేమిస్తే...

 

ప్రియమైన  స్నేహితులారా, 

మీ అందరికి Christmas శుభాకాంక్షలు.

December నెల ప్రారంభం అయినప్పటినుండి మనందరి  హృదయాలలో చెప్పలేని సంతోషం నిండిపోతుంది కదా! అయితే ఈ ఆనందానికి కారణం ఏమిటి? 

ఎవరైనా ఇంత సంతోషంగా ఉంటే ప్రేమలో పడ్డావా అని అంటారు కదా మరి వయసుతో తేడా లేకుండా మనలో కనిపిస్తున్న ఈ ఆనందానికి కారణం ప్రేమేనా?  అంతగా ప్రేమించడానికి.. ప్రేమించబడడానికి కారణమైన వ్యక్తి ఎవరు? 
వ్యక్తి కాదు సర్వ శక్తి గల సర్వోన్నతుడు... ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వేశ్వరుడు ... ఆ  దేవాది దేవుడు మనలను ప్రేమించాడంట...
"మలాకీ 1:2 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను."

మనము ఎవరినైనా ప్రేమించిన లేక ప్రేమించబడిన,  ఆ ప్రేమకు గుర్తుగా ఏదయినా బహుమతి గాని లేక సహాయంగాని చేయాలనుకుంటాము కదా అదేవిధముగా మనలను ప్రేమించిన మన తండ్రి ఆయన ప్రేమను మన పట్ల ఎలా కనపరిచారో లేఖనాలు వివరిస్తున్నాయి.
1. సృష్టి ఆది నుండి తాను చేసిన మనిషిని ప్రేమించి మట్టినుండి పుట్టిన మానవుడు తిరిగి మట్టిగామారి నశించి పోకుండా మహిమ దేహం ధరించి తనతోనే నిత్యం ఉండాలని ఆయన సంకల్పించి ఈ భూమిమీద కూడా మనుషులు సంతోషంగా ఉండాలని మనపితరులకు వాగ్దానాలు చేసి ఆవాగ్దానం కొరకు మనము యెంతగా ఆప్రేమకు విరోధంగా జీవిస్తున్నా ఆయన మాటతప్పలేదు. 
"ద్వితీయోపదేశకాండము 4:37 ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను."

2. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక,  వీరు మానవులు మాట ఇచ్చేదేంటి... నిలబెట్టుకునేదేంటి... అని అనికోలేదు గాని తాను మనపితరులకు చేసిన ప్రమాణం కోసం తన ప్రేమ చేత మన అవిధేయతను భరిస్తూనే వచ్చారు.

"ద్వితీయోపదేశకాండము7:8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను."
"7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును."

3. దేవుడైన యెహోవాకు మనయెడల విపరీతమైన ప్రేమ కాబట్టి, ఈ లోక తలిదండ్రులు తమ బిడ్డలను చూచి మురిసిపోయినట్లుగానే ఆయన కూడా మనలను చూచి అంనందపడతారంట.

"ద్వితీయోపదేశకాండము10:15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను."

4. తండ్రికి మనమీద అపారమైన ప్రేమ కాబట్టి మనక్రియల వలన కలిగిన శాపాలను ఆశీర్వాదముగా మారుస్తున్నారు.

"ద్వితీయోపదేశకాండము23:5  అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.
33:3 ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు."

5. దేవుడు మనలను ఎంతో ప్రేమించుచున్నాడు గనుక మన పొరపాట్లను బట్టి గద్దించి బుద్ది నేర్పిస్తున్నారు.

"సామెతలు 3:12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును."
"యెషయా 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి."

6. ఆయన ప్రేమ శాశ్వతమైనది గనుక ఎన్నటెన్నటికి మన యెడల ఆయన కృప చూపిస్తూనే ఉన్నారు.

"యిర్మియా 31:3 చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను."
"1 కోరింథీయులకు 2:9 ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది."

"జెఫన్యా3:17 నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును."

7. తండ్రి తన ప్రేమను మనకు చూపించడానికి తాను చేయగలిగిందంతా చేసేసారు. చివరికి ఆయన తన ప్రియమైన
కుమారుణ్ణి కూడా మనకు కానుకగా ఇచ్చి తన ప్రేమకు అవధులు లేవని రుజువు చేసుకున్నారు. ఆ అద్భుతమైన కానుకయైన యేసుప్రభువు వారిని అనగా ఆయనకు ప్రియాతిప్రియమైన కుమారుణ్ణి మనకు ఎందుకిచ్చారు? పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఆయన కుమారుణ్ణే వారధిగా వేసి మనచేయి పట్టుకుని తన దగ్గరికి తీసుకోవాలనే గొప్పసంకల్పం ఆయన అంతులేని ప్రేమకు నిదర్శనం.
"యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను."
  • తండ్రి ఆ కానుకను యెందుకు మనకు ఇచ్చారు? మనలనుండి యేమి ఆశిస్తున్నారు?
ఆయన ఇచ్చిన కానుకను స్వీకరించి ఆ బహుమతిని ప్రేమించి ఆయన మాటకు లోబడడం మాత్రమే ఆయన మనల నుండి ఆశిస్తున్నారు. 

"యోహాను14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము."
  • ఆయన మాటలను అంగీకరించి ఆయన చిత్తప్రకారము నడవడమే ఆయన చూపిస్తున్న ప్రేమకు బదులు మనప్రేమను కనబరచడం.
"యోహాను14:24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 
15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు."
  • చివరకి తండ్రి ఇచ్చిన బహుమతి అయిన యేసయ్య కూడా మనలను ప్రేమిస్తున్నారు. అచ్చం తండ్రిలాగే....

"యోహాను15:9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
రోమా 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
8:37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము."
  • ఈ వాగ్దానాలు చూడండి  ఆనందంతో పరవశించిపోతాము.
"ఎఫెసీయులకు 1:6 మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
2:4 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.

"ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను." 

  • క్రిస్మస్ డిశంబరు 25న అవ్వచ్చు కాకపోవచ్చు. కాని ప్రభువు మనకోసం భూమి మీదకి నరావతారునిగా వచ్చి పాపంలో ఉన్న మన బ్రతుకులు మార్చి మనలను వెలిగించారు. ఇది నిశ్చయం. నా కోసం వచ్చి నన్ను వెలిగించిన నా ప్రభువు జన్మదినం నాకు పండుగ అనేది మన నినాదం.  ప్రపంచమంతా ఏక మనస్సుతో ఆ సంతోషాన్ని పంచుకోవడంలో మనంకూడా ఒక దివిటీ. అదే మనలో ఇంత సంతోషానికి కారణం.
క్రిస్మస్ శుభవార్త... యేసయ్య మాటలలో....

నేను పుట్టాను ....         మీరు పుడతారు 
నేను మరణించాను...    మీరు మరణిస్తారు 
నేను తిరిగి లేచాను...    మీరు కూడా తిరిగి లేస్తారు 
నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాను....  మీరు కూడా వస్తారు... 
రండి నా అడుగు జాడలలో.....

ఇదే సువార్త మానము రాజుల రాజు క్రీస్తు
యేసు క్ర్రీస్తు జననము  దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతి రూపము ప్రేమ మూర్తి జననము
యూదయ బెత్లెహేమందున రాజుల రాజుగ పుట్టెను
రక్షించును తనప్రజలను ఇలలో జీవము క్రీస్తు.

"ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
 2 కోరింథీయులకు 13:14"



Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...