దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ప్రభువు నందు ప్రియులారా,
బైబిల్ ను సాధారణంగా చదవడానికి మరియు ధ్యానపూర్వకముగా చదవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము బైబిలుని అధ్యయనం చేసి చదివినప్పుడు, సాధారణ పఠనానికి కంటే చాలా విషయాలను చేసుకోగలుగుతాము. అప్పుడే మనం దేవుని వాక్యము యొక్క మాధుర్యాన్ని అనుభవించగలుగుతాము.
వివిధ కారణాల వల్ల, క్రమం తప్పకుండా బైబిలు అధ్యయనం సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం బైబిల్ గురించి ధ్యానం చేయకపోతే మన ప్రభువు మన కోసం దాచిపెట్టిన మర్మమైన సత్యాలను కోల్పోతాము. 'భైబిలు అధ్యయన దిక్సూచి' (Bible Study Navigator) ద్వారా, నేను మీకు వాక్య ధ్యానమునకు కొంతవరకు సహాయం చేయగలను అనే అభిప్రాయముతో ఈ Blog ను ప్రారంభించాను, తద్వారా దేవునితో సహవాసాన్ని మరింతగా మెరుగుపరచుకొగలము.
బైబిలు అధ్యయనం చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. నేను ఎంచుకున్న పద్ధతి సమయోచిత బైబిలు అధ్యయన విధానం(Topical Bible Study Method). ఇందులో నేను ఒక అంశాన్ని ఎన్నుకుంటాను, మరియు దానికి సంబంధించిన అన్ని వచనాలను ఇక్కడ బైబిల్ నుండి ప్రస్తావిస్తాను. ఆ పద్దతి, మనము ఎంచుకున్న topic ని అర్ధము చేసుకుంటూ త్వరగా ముందుకు నడిపిస్తుంది. పరిమిత వ్యవధిలో మరిన్ని విషయాలను cover చేయడానికి, మరియు బైబిల్ నుండి చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.
అదే విధంగా ఆ ప్రత్యేక అంశానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను మీ ముందు ఉంచడానికి కూడా ప్రయత్నిస్తాను.
God bless u all...
Very much informative.... Written with experience...
రిప్లయితొలగించండిThank you so much sister
రిప్లయితొలగించండి