ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా,
ఇక విషయంలోకి వెళ్తే, సూర్యుడి గురించి ఆలోచిస్తే మనకు గుర్తొచ్చేదల్లా...ఎండాకాలంలో ఉక్క, వడగాల్పు, ఇంకా విపరీతమైన వేడి. కాని మనం కాస్త సూర్యుడి దగ్గర్లోకి వెళ్తే, అక్కడి పరిస్తితులను గురించి తెలుసుకుంటే వొళ్ళు గగుర్పొడిచే విషయాలు ఎన్నో ఉన్నాయి. సౌర వ్యవస్థ (Solar system) గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి.
నిర్మాణం & పరిణామం (Formation & evolution)
1. సూర్యుడు మరియు మిగిలిన సౌర వ్యవస్థ, అతి పెద్దగా తిరుగుతూ ఉన్నవాయువు మరియు ధూళి నుండి ఏర్పడి సౌర నిహారిక (solar nebula) అని పిలువబడుతుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
3. సూర్యుడు మరియు దాని వాతావరణం అనేక మండలాలు మరియు పొరలుగా విభజించబడ్డాయి. సౌర లోపలి భాగం, లోపలి నుండి, - ముఖ్యమైన కేంద్ర భాగం (core), రేడియేటివ్ జోన్ మరియు ఉష్ణప్రసరణ జోన్లతో రూపొందించబడింది. దాని పైన ఉన్న సౌర వాతావరణం ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, పరివర్తన ప్రాంతం మరియు కరోనాను కలిగి ఉంటుంది. సౌర గాలి కంటే మించి కరోనా నుండి బయటకు వచ్చే వాయువు(gas) చాలా విపరీతమైన వేడితోకూడి ఉంటుంది.
5. పురాతన సంస్కృతులలో సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని చాలామంది విశ్వసించారు, ఆవిషయాన్ని పురాతన గ్రీకు పండితుడు టోలెమి(Ptolemy) 150 B.C లో ఈ "భౌగోళిక" నమూనాను వివరించాడు. తరువాత 1543 AD లో నికోలస్ కోపర్నికస్ సౌర వ్యవస్థ యొక్క సూర్య-కేంద్రీకృత నమూనాను వివరించాడు మరియు 1610 లో గెలీలియో గెలీలీ బృహస్పతి చంద్రులను కనుగొన్నప్పుడు అన్ని ఆకాశపు సృష్ట్యాలు భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడంలేదని వెల్లడించాడు.
6. సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలు ఎలా పనిచేస్తాయనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, రాకెట్లను ఉపయోగించిన ప్రారంభ పరిశీలనల తరువాత, శాస్త్రవేత్తలు భూమి కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేయడం ప్రారంభించారు. నాసా(NASA) 1962 మరియు 1971 మధ్య ఆర్బిటింగ్ సోలార్ అబ్జర్వేటరీ అని పిలువబడే ఎనిమిది కక్ష్యల పరిశీలనశాలలను ప్రారంభించింది. వాటిలో ఏడు విజయవంతమయ్యాయి మరియు అతినీలలోహిత మరియు ఎక్స్-రే తరంగదైర్ఘ్యాల వద్ద సూర్యుడిని విశ్లేషించాయి అదేవిధంగా సూపర్-హాట్ కరోనాను కూడా ఫోటో తీశాయి.
సూర్యుడి గురించి వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా! కాస్త దగ్గరగా తీసిన చాయా చిత్రాలు చూస్తూఉంటేనే ఆ అగ్ని గోళం వింతగా, మనం ఊహించలేనంత పెద్దగా ఉంది.
- మరి ఆ అగ్ని గోళం ఎలా పుట్టింది?
- నిరంతరం నిప్పులు చిమ్ముతూ భగ భగ మండే ఈ సూర్యుడు ఎవరి ఆదీనంలో ఉన్నాడు?
నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుటను నిలువలేడు.. "నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ 1:5-9", అని వాగ్దానములు పొందినవాడైన యెహోషువ, దేవుని నమ్మి ఆయన శక్తిని గ్రహించినవాడై, ఇశ్రాయేలీయులకు అమోరీయులతో యుద్దము జరుగుతూ ఉన్నప్పుడు యెహోవాకు ప్రార్ధన చేసి ఈరీతిగా సూర్యుడితో మాట్లాడాడు.
సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము.
"సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. యెహోషువ 10:12-14."
ఇంత భయంకరమైన సూర్యుడు కూడా తన సృష్టికర్త అయిన యెహోవా అజ్ఞాపించి, నా సేవకుడైన యెహోషువ మాట విను అనగానే... ఆయన మాటకు లోబడిపోయి గిబియాలో ఆగి ఒకరోజంతా అక్కడనుండి కదలలేదంట.
ఈ విషయాన్ని నమ్మలేని అనేకమంది చాలా పరిశోధనల అనంతరం ఒక నిర్దారణకి వచ్చినట్లు తెలుస్తుంది.
బాల్టిమోర్, కర్టిస్ ఇంజిన్ కంపెనీ అధ్యక్షుడు మరియు హెరాల్డ్ హిల్ అనే వారు ఒక అంతరిక్షమునకు సంభందించిన కార్యక్రమంలో NASA తాజాగా ఇచ్చిన ఆవిష్కరణలలో, బైబిలులో ఉన్న ఇటువంటి సంఘటనలు అన్నీకూడా నిజమే అని దృవీకరించినట్లు వివరించారు.
కేంబ్రిడ్జ్ పరిశోధకులు: యెహోషువ సూర్యుడిని ఆపే బైబిల్ లోని సంఘటన యొక్క తేదీ అక్టోబర్ 30, 1207 B.C. అని మరియు ఇప్పటివరకు నమోదు చేయబడిన పురాతన గ్రహణం యొక్క రోజు సరిగ్గా 3,224 సంవత్సరాల క్రితం, అని వారు గుర్తించారు. కాబట్టి సూర్యుడిని నిశ్చలంగా ఉంచమని యెహోషువ ప్రభువును కోరాడు! అది నిజమే! సూర్యుడు, చంద్రుడు నిశ్చలంగా నిలబడి ఉండిపోయి రోజంతా గడిచిపోకుండా జాగ్రత్తపడ్డాయి. ఈ విషయం మీద మరలా కంప్యూటర్లలో వెదికి ఇది యధార్ద సంఘటన అని నిశ్చయానికి వచ్చారు. కాకపోతే ఇది వ్రాసిన సమయానికి తిరిగి వెళ్లి పరిశీలన చేస్తే, యెహోషువా యొక్క ఈ సంఘటనలో బైబిల్లో 'సుమారు' అని వ్రాయబడినట్లుగా ఆ రోజులో గడిచిన సమయం 23 గంటలు 20 నిమిషాలు - ఒక పూర్తి రోజు కాదు.
సూర్యుడా నువ్వు వెనక్కి వెళ్ళు...
యూదా రాజైన హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చినప్పుడు, నీవు మరణిస్తావు అని ప్రవక్త అయిన యెషయా దేవుని మాటను చెప్పగానే అతను దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్ధన చేసాడు. వెంటనే దేవుడు అతని ప్రార్ధన అంగీకరించి, అతనిని స్వస్థపరచి మరి 15 సంవత్సరముల వయస్సును పొడిగించారు. ఆయన సెలవిచ్చిన మాట ఖచ్చితముగా నెరవేరుతుంది అని చెప్పడానికి హిజ్కియాకి ఒక సూచన కూడా అనుగ్రహించారు.
"తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా? అందుకు హిజ్కియా యిట్లనెనునీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. 2 రాజులు 20:1-11" మరియు ప్రభువు నీడను పది డిగ్రీలు వెనుకకు తీసుకువచ్చాడు! సూర్యరశ్మిపై పది డిగ్రీలు అనగా మన గడియారంలో సరిగ్గా 40 నిమిషాలు! యెహోషువాలో 23 గంటలు 20 నిమిషాలు, 2 రాజులలో 40 నిమిషాలు విశ్వంలో తప్పిపోయిన ఒకరోజును పూర్తి చేస్తుంది.
ఆ 40 నిమిషాల గురించి పెద్దగా పట్టించుకోకపోతే దాని వల్ల 1000 సంవత్సరాల లెక్కలలో తేడాలొస్తాయి. అలాగే కక్ష్య గణాంకాలలో చాలా తేడావస్తుంది, అందువల్ల ఆ నలభై నిమిషాల సంగతేంటి అని బైబిలు ఆధారంతో పరిశోధించవలసి వచ్చిందని పరిశోధకులు నిర్ధారించారు.
ఈ సంఘటనను యెహోషువా కథతో పోల్చినప్పుడు, అక్కడ తప్పిన 40 నిమిషాలు హిజ్కియా దగ్గర పూర్తవుతుంది అని గమనించండి: మొత్తం మీద ఒక రోజు పూర్తిగా తప్పిపోయింది; అనగా యెహోషువా సమయంలో 23 గంటలు 20 నిమిషాలు మరియు హిజ్కియా సమయంలో 40 నిమిషాలు. చూసారా పరిశుద్ధ దేవుని Perfection.
ఈ రెండు సంఘటనల గురించి పరిశోధకుల అధ్యయనాల గురించి మరింత సమాచారం కోసం దిగువ బాగంలో లింక్స్ ఇస్తున్నాను గమనించండి.
సూర్యుడు దేవాది దేవుని మాటకు ఎంతగొప్పగా లోబడిందో చూసారా? అయితే మన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే మరొక సూర్యుణ్ణి కూడా మనం చూడగలం. ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడు మన శారీరక జీవితానికి ఉపయోగపడుతుంది కాని అది అశాశ్వతం. అయితే ఆయన యందు భయభక్తులు గలవారిమీద ఉదయించడానికి మరొక సూర్యుడిని తండ్రి మన కొరకు పంపించారు. ఆ సూర్యుడే నీతి సూర్యుడుగా వచ్చి మనజీవితాలను వెలిగించి, మన పాపాలనిమిత్తమే మరణించి తిరిగిలేచి మరలా మనకోసం రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు.
"అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. మలాకి 4:2."
ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు ఈ జీవితకాలం మట్టుకే ఉంటాడు. మరి కొద్దికాలంలో దానికి చీకటి కమ్మి మరుగైపోతుందని వాక్యం చెబుతుంది. మన జీవితాలలో ప్రకాశించిన నీతి సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు, ఆయనే నిత్యమైన వెలుగుగా ఉంటారు. "ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును. యెషయా 60:19-20."
అంతే కాకుండా ఆయన వెలుగులో ప్రకాశించేవారు పరలోకంలో ప్రకాశించే సూర్యునివలే ఉంటారని యేసయ్య చెబుతున్నారు. "అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. మత్తయి 13:43."
ఇదంతా పరిశీలన చేసిన తరువాత సూర్యుడే ఒక అద్భుతంగా మన కళ్ళకు కనిపిస్తూ ఉంటే, కనిపించని రాబోయే మహా అద్భుతము కొరకు కనిపెట్టుచూ విశ్వాసముతో మన రక్షణను కొనసాగించవలసిన భాధ్యత క్రీస్తు రక్తముతో కొనబడిన మన మీద ఉన్నది. "ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. ప్రకటన 21:23."
"రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన 22:5."
ప్రియ స్నేహితులారా ఎంత గొప్ప వాగ్దానము మనకివ్వబడింది కదా! ఈ లోకంలో ఎండ, వెలుగు, గాలి, నీరు చివరికి మన ప్రాణం ... ఏదీ శాస్వతం కాదని మనకు ఖచ్చితముగా తెలుసు గనుక, మనకు బహుమతిగా ఇవ్వబడిన ఈ చిన్న జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. విశ్వాస పోరాటం పోరాడి, మరణం తరువాత దేవుని రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగాలు సర్వోన్నతుని సాన్నిధ్యములో జీవించబోతున్నాము.
నేను ముగిస్తున్నాను. ఆయలో అనందిద్దాం.
మింటను యెహోవాకు సాటియైనవాడెవడు?
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు?
నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.
ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?
నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు.
యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
బైబిలు నుండి సూర్యుని గురించిన వచనాలు క్రింద ఇస్తున్నాను గమనించండి.
1. ఆదికాండము - 1:14-16
2. యెహోషువ - 10:12,13, 14
3. యోబు - 9:7
4. కీర్తన - 19:4,5,6; 74:16; 84:11; 104:19; 136:8;
5. యెషయా -38:8; 49:10; 60:19,20
6. యిర్మియా - 8:2; 31:35
7. యోవేలు - 2:31; 3:15
8. ఆమోసు - 8:9
9. హబక్కుకు - 3:11
10. మలాకి - 4:2
11. మత్తయి - 5:45; 13:43; 24:29
12. ప్రకటన - 1:16; 6:12; 7:16, 8:12; 9:2; 10:1; 16:8; 19:17; 21:23; 22:5.
యెహోషువ మరియు హిజ్కియా గురించి జరిహిన పరిశోధన వివరాలు.
https://www.solbu.net/english/did-nasa-really-prove-the-bible-accounts-of-joshua-and-hezekiah-that-a-day-is-missing.html
https://en.wikipedia.org/wiki/Hezekiah
Good explanation about sun. So everyone who reads this topic will know sun is made by God. And sun is not God.. Tq
రిప్లయితొలగించండిGood explanation about sun. So everyone who reads this topic will know sun is made by God. And sun is not God.. Tq
రిప్లయితొలగించండిExcellent work..thanks for explaining the hidden truths.
రిప్లయితొలగించండిExcellent work dear nd I've learnt lot of amazing truths from the bible...god bless u abundantly...
రిప్లయితొలగించండిThank u very much
రిప్లయితొలగించండిThank you very good explanation about sun from bible.and learnt how Sun obeyed Gods voice. Nature is always in Gods control.
రిప్లయితొలగించండిThank u so much my sister
రిప్లయితొలగించండిPraise the Lord Sister Thank you for explaining the greatness of our God so well when God bless you🙏
రిప్లయితొలగించండి