ప్రభువు నందు ప్రియమైన స్నేహితులారా,
నోవహు అనే అంశంతో ఈ Blog ని ప్రారంభించడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. ఈయన మన క్రైస్తవ జీవితానికి చక్కటి మాదిరి. మనము ప్రస్తుతము ఉన్న పరిస్థితులలో ఈ అంశాన్ని అధ్యయనం చేయడము వలన, దేవుని పై మనకు అపారమయిన విశ్వాసము బలపరచబడుతుందని నేను ఆశపడుతున్నాను.
ఈ గొప్ప వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు వ్యక్తిగతంగా నాకు చాలా విషయాలు భోధపడ్డాయి. అందులో మీతో కొన్ని సంగతులు పంచుకోవాలని ఆశపడుతున్నాను.
నోవహు 950 సంవత్సరాలు ఈ భూమిపై నివసించాడు. ఈ గొప్ప వ్యక్తి బైబిల్లో ఎలా వర్ణించబడ్డాడో చూద్దాం ...
- యెహోవా దృష్టిలో కృప పొందినవాడు.
- నీతిపరుడును, తన తరములో నిందారహితుడు.
- దేవునితో కూడా నడచినవాడు.
- విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు.
- నీతిని ప్రకటించిన వాడు.
దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేయడానికి, లెక్కల ప్రకారం 120 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. అదే సమయంలో, తను అంతవరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి, భయభక్తులను విడిచి పెట్టకుండా ఓపికతో ఓడను కట్టుకున్నాడు. తాను ఏమి చేయబోతున్నాడో దేవుడు అతనికి చెప్పినప్పుడు, నోవహు దేవునిని నమ్మి ఓపికగా ఎదురు చూశాడు.
ఇప్పుడు ఓడ ready అయిపోయింది. దేవుడు చెప్పిన జీవులన్నీ అందులోకి చేరిపోయాయి. 8 మంది కుటుంబ సభ్యులు కూడా ఎక్కేసారు. అయినా, మరో 7 రోజులు ఓడలో అలా నిశ్శబ్ధముగా ఎదురు చూచాడు. అంటే, ఈ సమయంలో మిగతా వారిని రక్షించడానికి దేవుడు అనుమతించాడు. ఇంకా ఇంకా వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 1పేతురు 3:20 ప్రకారం, తన ప్రజలను రక్షించడానికి, దేవుడు సత్యాన్ని ప్రకటించి మరియు వారి మార్పు కోసం ఎదురు చూశాడు. నోవహుకు మొత్తం విషయం తెలియకపోయినా, అతను అలసిపోలేదు మరియు దేవుడు ఎప్పుడు ఏమి చెబుతారో అని ఎదురు చూచినట్లు కనిపిస్తుంది కదా!
అదే విధంగా, ఇప్పుడు కూడా దేవుడు కృపకాలం మన ముందుంచి వేచి ఉన్నాడు. 2020 సంవత్సర ప్రారంభంతో, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడు, ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. దేవుడు నోవహు కాల ప్రజల కోసం మరో ఏడు రోజులు వేచి ఉన్నట్లే, మన రోజులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ జీవితం ఎప్పుడైనా ముగుస్తుంది, కాని దేవుని రాజ్యంలో ప్రవేశించడమే మన ముందు ఉన్న లక్ష్యం.
ఈ లోకం అశాస్వతం అని ఇప్పటికే బాగా అర్థమవుతుంది కదా! మన కళ్లముందు వేలాది మంది తనువు చాలిస్తున్నారు. మనం కూడా ఆ వoతులో చేరే సమయం దగ్గర పడుతుంది. యెహెజ్కేలు 14:14 ప్రకారం “నోవహు, దానియేలు, యోబు అనే ముగ్గురు మనుషులు దానిలో ఉన్నా, వాళ్లు తమ నీతి వల్ల కేవలం తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” నోవహు మాదిరిగానే మనం కూడా మన నీతిని కాపాడుకోవాలి. హీబ్రూ 11: 7 ప్రకారం, విశ్వాసమునకు కలుగు నీతికి నోవహు వారసుడైనట్లు, ఆ వారసత్వాన్ని మనం కూడా పొందుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
ఇవన్నీ నోవహు జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా నాకు అర్థమయిన కొన్ని విషయాలు. నోవహు గురించి లేఖనాల్లో నుండి అన్ని వచనాలు క్రింద ఉన్నాయి. మీరు కూడా అధ్యయనం చేసినప్పుడు ప్రభువు మీతో మాట్లాడిన విషయాలు నాతో పంచుకోండి. ఈ విధంగా విశ్వాసంలో ఒకరినొకరు బలపరుచుకుందాం.
ఆదికాండము 5:29 - భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.
ఆదికాండము 5:32 - నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
ఆదికాండము 6:8 - అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
ఆదికాండము 6:9 - నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
ఆదికాండము 6:13 - దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.
ఆదికాండము 6:22 - నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
ఆదికాండము 7:1- యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.
ఆదికాండము 7:5 - తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.
ఆదికాండము 8:1 - దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
ఆదికాండము 9:1 - మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
ఆదికాండము 9:29 - నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.
యెషయా 54:9 - నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
యెహెజ్కేలు 14:14 - “ ‘నోవహు, దానియేలు, యోబు అనే ముగ్గురు మనుషులు దానిలో ఉన్నా, వాళ్లు తమ నీతి వల్ల కేవలం తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
హిబ్రూ 11:7 - విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
1 పేతురు 3:20 - దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
2 పేతురు 2:5 - మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
చారిత్రాత్మక ఆధారాలు:
1. నోవహు యొక్క ఓడ కొరకు శోధనలు కనీసం Eusebius సమయం (మ .275–339) నుండి నేటి వరకు చేయబడ్డాయి. ఏదేమైనా, అరారత్ పర్వతం, సాంప్రదాయకంగా నోవహు ఓడ యొక్క విశ్రాంతి ప్రదేశంగా పరిగణించబడుతుంది. దీనిని బైబిల్ పర్వతం అంటారు. అరారత్ పర్వతం 11 వ శతాబ్దం నుండి ఆదికాండం ఖాతాతో సంబంధం కలిగి ఉంది, మరియు అర్మేనియన్లు ఆ సమయంలో ఓడ యొక్క ల్యాండింగ్ ప్రదేశంగా గుర్తించడం ప్రారంభించారు.
2. 2007 మరియు 2008 లో ఏడు పెద్ద చెక్క కంపార్ట్మెంట్లు సముద్ర మట్టానికి 13,000 అడుగుల (4,000 మీటర్లు) ఎత్తులో, అరారత్ పర్వతం శిఖరం దగ్గర కనుగొన్నట్లు పరిశోధిస్తున్న బృందం పేర్కొంది. వారు అక్టోబర్ 2009 లో చిత్ర బృందంతో తిరిగి సైటుకి వచ్చారు.
3. అనేక ఇతర సంస్కృతులలో పురాతన వరద కథలు కూడా ఉన్నాయి. ఈ కథలను సాధారణంగా పురాణాలు లేదా నైతిక కథలుగా తీసుకుంటారు, కాని శాస్త్రవేత్తలు ఇప్పుడు 7,000 సంవత్సరాల క్రితం నల్ల సముద్రం ప్రాంతంలో గొప్ప వరద సంభవించినట్లు ఆధారాలు కనుగొన్నారు.
4. సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తలు నల్ల సముద్రం యొక్క గొప్ప వరదలో మరణించిన ప్రజల మొదటి సాక్ష్యాలను కనుగొన్నారు, అది నోవహు యొక్క ఓడ కథతో ముడిపడి ఉంది. రోబోట్ నీటి అడుగున వాహనాలను ఆ సముద్రపు ఉపరితలం కంటే 300 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉపయోగించడం ద్వారా, వారు రోలింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మ్యాప్ చేయడం ప్రారంభించారు, అవి 7,000 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వరదలతో నిండిన ప్రవాహాల ద్వారా తినిపించబడి, వాటిల్ మరియు డౌబ్ ఇళ్లతో ( గోడలు మరియు భవనాల తయారీకి ఉపయోగించే మిశ్రమ భవన పద్ధతి) గుర్తించబడ్డాయి.
5. . క్రియేషన్ మ్యూజియం (పీటర్స్బర్గ్, కెంటుకీ) వద్ద మరియు సమీపంలోని గిడ్డంగిలో మందసము యొక్క భాగాల ప్రతిరూపాలు(Replicas of portions of the ark ) ఉన్నాయి.
దేవుడు నోవహుకు ఇచ్చిన కొలతలతో యుఎస్ లో తయారైన మరో ఓడ ఇప్పుడు మనకు కనిపిస్తుంది.
పైన చెప్పినట్లుగా, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఇక్కడ పొందుపర్చాను. ఈ అంశంపై మీ బైబిలు అధ్యయనంలో ఈ విషయాలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
క్రింద ఇవ్వబడిన లింక్‌లలోని పుస్తకాలు మరింత తెలుసుకోవడానికి మనకు చాలా సహాయపడతాయి.
https://www.goodreads.com/book/show/1065303.Noah_s_Ark
https://www.getepic.com/book/13939719/noahs-ark-the-story-of-the-flood-and-after
God of goodness, give me yourself.
For you are sufficient for me
If I were to ask for anything less
I should always be in want,
for in you alone do I have all
Julian of Norwich (?1342 - after 1413)
చాలా చక్కగా వివరించారు. దేవుడు మీకు ఇంకా మంచి ఆలోచనలు ద్వారా నడిపించును గాక.
రిప్లయితొలగించండిThank you very much
రిప్లయితొలగించండి